Rinky Chakma: 28 ఏళ్లకే కన్నుమూసిన మిస్ ఇండియా త్రిపుర.. క్యాన్సర్‌తో రింకీ మృతి

2022లో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. బ్రెస్ట్ క్యాన్సర్ (మాలిగ్నెంట్ ఫైలోడ్స్ ట్యూమర్) నిర్ధరణ అయింది. కొద్ది రోజులకే క్యాన్సర్ శరీరమంతా వ్యాపించింది. ఈ క్యాన్సర్ ఊపిరితిత్తులు, మెదడు కణితిలోకి చేరింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 1, 2024 | 02:42 PMLast Updated on: Mar 01, 2024 | 2:42 PM

Miss India Tripura 2017 Rinky Chakma Dies After Being Diagnosed With Breast Cancer

Rinky Chakma: మిస్ ఇండియా ఫైనలిస్ట్ రింకీ చక్మా కన్నుమూశారు. క్యాన్సర్‌తో ఆమె 28 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయారు. త్రిపురకు చెందిన రింకీ చక్మా.. 2017లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచారు. మిస్ కన్జెనియాలిటీ, మిస్‌ బ్యూటీ విత్ పర్పస్‌ టైటిల్స్ కూడా గెలుచుకున్నారు. కాగా, 2022లో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. బ్రెస్ట్ క్యాన్సర్ (మాలిగ్నెంట్ ఫైలోడ్స్ ట్యూమర్) నిర్ధరణ అయింది. కొద్ది రోజులకే క్యాన్సర్ శరీరమంతా వ్యాపించింది. ఈ క్యాన్సర్ ఊపిరితిత్తులు, మెదడు కణితిలోకి చేరింది.

GANTA VS BOTSA: నిను వీడని నీడను నేనే.. గంటాను వదలని బొత్సా.. భీమిలీకి షిప్ట్ తో పరేషాన్

డాక్టర్లు ఆమెకు బ్రెయిన్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే కొన్నివారాల క్రితం తన చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం చేయాల్సిందిగా సోషల్ మీడియాలో కోరారు. ఇలా ఆరోగ్య విషయాలను పంచుకోవడం తనకు అసౌకర్యంగా ఉందని వివరించారు. తన వద్ద ఉన్న డబ్బుతోపాటు దాచుకున్న సొమ్మంతా కరిగిపోయిందని తెలిపారు. అప్పటికే ఆ క్యాన్సర్ మహమ్మారి తన శరీరంలో చాలావరకు వ్యాపించిందని.. బతకడానికి 30 శాతం ఆశలే ఉన్నాయని గత నెలలో రింకీ చక్మా ఒక పోస్ట్ పెట్టారు. దాదాపు రెండేళ్లుగా రింకీ చక్మా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. తనకు కీమోథెరపీ చికిత్స జరుగుతుందని.. గత రెండేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నామని సాయం చేయాలని వేడుకుంది. దీంతో తన వైద్య ఖర్చుల కోసం ఆమె స్నేహితులు, మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న స్నేహితులు నిధులు సేకరించారు. చికిత్స అందించారు. అయితే, ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది.

దీంతో ఫిబ్రవరి 22న రింకీ చక్మా కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వైద్యులు చికిత్స అందినా.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరకు పరిస్థితి విషమంగా మారడంతో రింకీ కన్నుమూశారు. ఈ విషయాన్ని మిస్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ధ్రువీకరించింది. ఇక రింకీ చక్మా మరణ వార్త విని ఆమె అభిమానులు, నెటిజన్లు షాక్​కు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.