కొత్త విమానం కొన్న అంబానీ ఇది ఎగిరే ఇంద్రభవనం
రియలన్ష్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏం చేసినా గ్రాండ్‌గానే ఉంటుంది. ఆయన ఇంట్లో ఏం జరిగినా అది నేషనల్ వైడ్ న్యూస్‌గా మారపోతోంది. ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా కొడుకు పెళ్లి చేసని ముఖేస్ అంబానీ ఇప్పుడు మరోసారి అందరి చూపు తనవైపు తిప్పుకున్నారు.
రియలన్ష్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏం చేసినా గ్రాండ్‌గానే ఉంటుంది. ఆయన ఇంట్లో ఏం జరిగినా అది నేషనల్ వైడ్ న్యూస్‌గా మారపోతోంది. ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా కొడుకు పెళ్లి చేసని ముఖేస్ అంబానీ ఇప్పుడు మరోసారి అందరి చూపు తనవైపు తిప్పుకున్నారు. తన ప్రైవేట్ జెట్ కలెక్షన్‌లో మరో కొత్త విమానాన్ని యాడ్ చేశారు ముఖేష్ అంబానీ. రీసెంట్‌గానే ఆయన తన వ్యక్తిగత, బిజినెస్ అవసరాలకు కొత్త విమానం కొన్నారు. బోయింగ్ 737 మ్యాక్స్ అనే ఈ విమానం ధర అక్షరలా వెయ్యి కోట్ల పైమాటే. ఈ విమానాన్ని కొన్న తరువాత తన అవసరాలకు అనుగునంగా ఇందులో మార్పులు కూడా చేశారు. కంఫర్ట్‌తో పాటు ఫ్యామిలీ మొత్తం లగ్జరీగా ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బోయింగ్ 737 MAX లగ్జరీ విమానానికి ఇప్పటికే ఫ్లయింగ్ టెస్టులు పూర్తయ్యాయి. 2023 ఏప్రిల్ 13 నుంచి 2024 ఆగస్టు 27 వరకు ఈ విమానానికి అవసరమైన అన్ని ట్రయల్స్ నిర్వహించారు. ఇంటీరియర్ అప్‌డేట్ చేయడంతో పాటు క్యాబిన్‌లో మార్పులు కూడా చేశారు.
సింపుల్‌గా చెప్పాలంటూ ఓ లగ్జరీ ఇల్లు గాలిలో ఎగురుతూ వెళ్తే ఎలా ఉంటుందో అంబానీ కొన్న ఈ కొత్త విమానం కూడా అలానే ఉంటుంది. స్విట్జర్లాండ్‌లో దీన్ని రీమోడలింగ్ చేయించారు. బేసెల్, జెనీవా, లండన్, లుటన్ విమానాశ్రయాల్లో టెస్టింగ్ చేశారు. అన్ని అప్‌గ్రేడ్‌లు పూర్తయిన తర్వాత, టెస్టులు అన్నీ పూర్తి చేసి దీన్ని ఇండియాకు తీసుకొచ్చారు. ఆగస్టు 27 2024న దీన్ని బేసెల్ నుంచి ఢిల్లీకి తీసుకుని వచ్చారు. ఇది 9 గంటల్లో 6 వేల 2 వందల 34 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ప్రస్తుతం ఈ కొత్త విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని కార్గో టెర్మినల్ సమీపంలోని మెయిన్‌టేనెన్స్ టెర్మినల్‌లో ఉంది. రిలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ముంబయికి త్వరలో ఈ జెట్ రానుంది. బోయింగ్ 737 MAX 9 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్‌లలో ఒకటి. ఇది రెండు CFMI లీప్-18 ఇంజిన్‌లతో పనిచేస్తుంది. 8401 MSN అంబానీ కొత్త విమానం రిజిస్ట్రేషన్ నెంబర్. 11 వూల 770 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. ఇండియన్ కరెన్సీలో ఈ బోయింగ్ ధర 990 కోట్లు. అధనంగా మార్పులు చేశరు కాబట్టి ధర వెయ్యి కోట్లు దాటింది. ఇండియాలో ఇంత కాస్లీ కొన్న మొదటి వ్యక్తి అంబానీ మాత్రమే. కేవలం ఇదే కాదు.. అంబానీ దగ్గర ప్రైవేట్ జెట్ కలెక్షనే ఉంది. ఇప్పటికే ఆయన దగ్గర వివిధ మోడల్స్‌కు చెందిన 9 విమానాలు ఉన్నాయి. ఒప్పుడు కొన్న కొత్త విమానం పదోది. ఇవే కాకుండా రెండు హెలికాఫ్టర్లు కూడా ఉన్నాయి. ఇక కార్ల కలెక్షన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంబానీ విషయంలో రోడ్‌ని బట్టి మూడ్‌ని బట్టి వెహికిల్ మారిపోతుంది. అందుకే ఆయన గ్యారేజీలో ఇన్ని వెహికిల్స్ ఉన్నాయి.