Mukesh Ambani: రిటర్న్ గిఫ్ట్ అదుర్స్.. అతిథులకు అంబానీ ఫ్యామిలీ రిటర్న్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..
అంబానీ ఫ్యామిలీ కూడా తమ స్టేటస్‌కు తగ్గ రేంజ్‌లో ఈ వేడుకలకు సూపర్ లగ్జేరియస్ ఏర్పాట్లు చేసింది. ఫ్రీ వెడ్డింగ్‌కు వచ్చిన అతిథుల కోసం అంబానీ అందించిన లగ్జరీల గురించిన తెలిసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.
Mukesh Ambani: అంబానీ ఫ్యామిలీలో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఓ సంబరంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలపై ఇప్పటికీ దేశమంతా చర్చించుకుంటోంది. రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారతదేశ కుబేరుడి కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రపంచంలోని అతిరథమహారథులందరూ తరలి వచ్చారు. ఇక అంబానీ ఫ్యామిలీ కూడా తమ స్టేటస్‌కు తగ్గ రేంజ్‌లో ఈ వేడుకలకు సూపర్ లగ్జేరియస్ ఏర్పాట్లు చేసింది. ఫ్రీ వెడ్డింగ్‌కు వచ్చిన అతిథుల కోసం అంబానీ అందించిన లగ్జరీల గురించిన తెలిసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.
Nita Ambani: నీతా.. ది క్వీన్.. ఆరు లుక్స్‌లో అదరగొట్టిన నీతా అంబానీ
ఈ ఈవెంట్‌కు వచ్చిన అతిథుల కోసం అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన, ప్రత్యేకమైన సేవలను ఏర్పాటు చేసింది. ముంబై, ఢిల్లీ నుంచి జామ్ నగర్‌కు చార్టర్డ్ విమానాలు, ప్రపంచ స్థాయి చెఫ్‌లు, వార్డ్ రోబ్ సేవలు, అతిథుల కోసం విలాసవంతమైన కార్లు, ఖరీదైన గుడారాలు ఏర్పాటు చేశారు. జామ్ నగర్ విమానాశ్రయం నుంచి అంబానీ గ్రాండ్ రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్‌కు అతిథులు వెళ్లడానికి రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, బీఎమ్‌డబ్ల్యూతో సహా లగ్జరీ కార్లను కూడా అందించారు. ప్రీ వెడ్డింగ్ పార్టీకి హాజరయ్యే అతిథులకు లాండ్రీ, ఎక్స్‌ప్రెస్ బట్టలు, చీరలు, హెయిర్ స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టులతో సహా ఎన్నో రకాల సేవలను అందించారు. ఇక అనంత్ అంబానీ–రాధిక మర్చంట్ ప్రి వెడ్డింగ్‌కు వచ్చిన వీవీఐపీలకు అంబానీ ఫ్యామిలీ.. రిటర్న్ గిఫ్ట్స్ కూడా అందించింది. ఇవే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. వచ్చిన గెస్ట్‌లకే ఇంత గ్రాండ్‌గా, రిచ్‌గా ఏర్పాట్లు చేసారంటే.. రిటర్న్ గిఫ్ట్‌లు కూడా అంతే ఖరీదైనవి అయి ఉంటాయని అంతా అనుకున్నారు.
Bengaluru water crisis: మా ఇంట్లోనే నీళ్ళు రావట్లేదు.. బెంగళూరు నీటి కొరతపై డిప్యూటీ సీఎం!
కానీ ఇక్కడే నీతా అంబానీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె తన ప్రత్యేక చొరవతో స్పెషల్ గిఫ్ట్‌లు తయారు చేయించారు. అవే మైనపు దీపాలు. ఎంతో అపురూపంగా తీర్చిదిద్దిన ఈ మైనపు దీపాలను మహాబలేశ్వర్‌కు చెందిన కళాకారులు ఎంతో అద్భుతంగా తయారు చేశారు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే.. వీటిని తయారు చేసిన కళాకారులకు కళ్లు కేవలం 10 శాతం మాత్రమే కనబడతాయి. కొందరు పూర్తిగా అంధులు. అలా విధివంచితులైన వారి చేతుల్లో ఆ మైనపు దీపాలు రూపుదిద్దుకున్నాయి. కొలనులో విచ్చుకున్న తామర పుష్పాల్లా వీటిని తయారు చేశారు. దృష్టిలోప కళాకారులు రూపొందించిన ఈ దివ్వెలే పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌గా అందించింది అంబానీ ఫ్యామిలీ. ప్రధాని మోదీ 2014లో ప్రారంభించిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మహాబలేశ్వర్‌లో ఈ మైనపు దీపాలు తయారు చేస్తున్నారు.
వీరిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అంబానీ ఫ్యామిలీ దృష్టిలోప కళాకారులకు ఆర్డర్ ఇచ్చారట. వారు తయారు చేసిన మైనపు దీపాలే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్‌గా దేశ విదేశాలకు వెళ్లాయి. ఈ విషయం తెలిసి అంబానీ ఫ్యామిలీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంబానీ ఫ్యామిలీ సంపద విషయంలోనే కాదు.. మంచి మనస్సున్న వ్యక్తులుగానూ మొదటి స్థానంలో ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.