Nitin Gadkari : పార్లమెంట్ ఎన్నికల వేళ నిత్ గడ్కరీ సంచల వ్యాఖ్యలు..!
'ఈ రోజుల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకులు తక్కువ సంఖ్యలో ఉన్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) అన్నారు. అవకాశవాదులే ఎక్కువగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) వేళ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి (Transport Minister) నిత్ గడ్కరీ సంచల వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజుల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకులు తక్కువ సంఖ్యలో ఉన్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) అన్నారు. అవకాశవాదులే ఎక్కువగా ఉన్నారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీతో అంటకాగాలని చూసే వారే అధికమని అన్నారు. సిద్ధాంతాల భూమిక లేకపోవడం ప్రజాస్వామ్యానికి (Democracy) మంచిది కాదని చెప్పారు. కాగా ముంబై (Mumbai) లో మంగళవారం లోక్ మత్ మీడియా సమావేశంలో ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ హజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు. దేశంలో ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే.. మంచి పని చేసేవాడికి అసలు గౌరవం లభించదని.. చెడ్డ పని చేసే వారికి శిక్ష పడదని తానెప్పుడూ సరదాగా చెప్పేవాడినని ఆయన ఆ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు. దేశ సార్వత్రిక ఎన్నికల (National General Elections) వేళ ఎవరిని ఉద్దేశించి నితిన్ గడ్కరీ ఈ మాటలు అన్నారో అని సొంత పార్టీ నేతలే కాకుండా.. ప్రతిపక్ష పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు. కాగా ఆయన ఎవరి ఉద్దేశించి ఇలా అన్నారో.. ఆ పేరు వెల్లడించలేదు.