MLA : ఒకప్పుడు పేపర్ బాయ్ ఇప్పుడు ఎమ్మెల్యే..
ఎన్నికల్లో గెలవడం అంటే డబ్బు పంచడం కాదు. రాజకీయాల్లో రాణించడం అంటే కోట్ల ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. సాధారాణంగా రాజకీయ నేతలు అనగానే వాళ్లు చాలా రిచ్ అనుకుంటారు అందరూ. నిజానికి ఈ రోజుల్లో పాలిటిక్స్ కూడా అలాగే ఉన్నాయి. కానీ డబ్బు లేకుండా, పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకున్నా.. ప్రజల్లో ఆదరణ ఉంటే చాలని నిరూపించాడు ఓ వ్యక్తి. ఒకప్పుడు ఏ ప్రాంతంలో పేపర్ బాయ్‌గా పని చేశాడో.. ఇప్పుడు అదే ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాడు.
ఎన్నికల్లో గెలవడం అంటే డబ్బు పంచడం కాదు. రాజకీయాల్లో రాణించడం అంటే కోట్ల ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. సాధారాణంగా రాజకీయ నేతలు అనగానే వాళ్లు చాలా రిచ్ అనుకుంటారు అందరూ. నిజానికి ఈ రోజుల్లో పాలిటిక్స్ కూడా అలాగే ఉన్నాయి. కానీ డబ్బు లేకుండా, పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకున్నా.. ప్రజల్లో ఆదరణ ఉంటే చాలని నిరూపించాడు ఓ వ్యక్తి. ఒకప్పుడు ఏ ప్రాంతంలో పేపర్ బాయ్‌గా పని చేశాడో.. ఇప్పుడు అదే ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాడు. పేపర్ అని చెప్పిన ఆ నోటితోనే.. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో అధ్యక్షా అనబోతున్నారు. ఆయననే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. ఖానాపూర్ నుంచి అనూహ్యంగా గెలిచిన వెడ్మ బొజ్జు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, బీఆర్‌ఎస్ నుంచి కేటీఆర్ ఫ్రెండ్ జాన్సన్ రాథోడ్‌ను కూడా పక్కకు జరిపి.. ఖానాపూర్ ప్రజల మనసు గెలుచుకున్నారు వెడ్మ బొజ్జు. దీంతో అసలు ఎవరీ వెడ్మ బొజ్జు.. సైలెంట్‌గా వచ్చి డైరెక్ట్‌గా ఎలా ఎమ్మెల్యే అయ్యాడు అనే టాపిక్ మొదలైంది. ఆదివాసీ గోండు బిడ్డ అయిన వెడ్మ బొజ్జుది చాలా సామాన్య జీవితం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం కల్లూర్‌గూడకు చెందిన నిరుపేద ఆదివాసీ దంపతులు వెడ్మ భీంరావు, గిరిజాబాయిల కొడుకే ఈ వెడ్మబొజ్జు పటేల్. పీజీ వరకు చదివిన బొజ్జు తొలుత ఆదివాసీ విద్యార్థి సంఘంలో.. తర్వాత ఆదివాసీ హక్కుల పోరాట సమితి అయిన తుడుందెబ్బలో సలహాదారుడిగా పనిచేశాడు. ఆ తరువాత కాంట్రాక్ట్ ఉద్యోగిగా కొన్నేళ్లు పని చేశాడు. జాబ్ చేస్తున్న సమయంలో జీతం సరిపోక.. పార్ట్ టైం ఉద్యోగంగా న్యూస్ పేపర్లు వేసేవాడట వెడ్మ బొజ్జు. రాజకీయాలపై ఆసక్తితో.. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చాలా తక్కువ సమయంలోనే అధిష్ఠానం దృష్టిని ఆకర్షించి ఖానాపూర్ టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో వెడ్మ బొజ్జు సమర్పించిన వివరాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే ఇప్పటికీ ఉంటున్నారట వెడ్మ బొజ్జు కుటుంబం. తన బ్యాంక్ అకౌంట్‌లో కేవలం 10 వేలు మాత్రమే ఉన్నాయని.. ఇక తన అప్పులు 8 లక్షల 42 వేలు ఉన్నాయంటూ ఎన్నికల అఫిడివిట్‌లో చెప్పారు. ఇంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తి.. మొతటి ప్రయత్నంలోనే కాంగ్రెస్ లాంటి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.