MODI LAKSHADWEEP: మోడీ లక్షద్వీప్ టూర్‌కు సీక్రెట్ ఎజెండా.. అసలు లక్ష్యం అదే..
ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్‌లో రెండు రోజుల పాటు పర్యటించారు. ఆ ప్రాంతంలో 1,150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక సీక్రెట్ ఎజెండా ఉందంటున్నారు.
MODI LAKSHADWEEP: ప్రధాని నరేంద్రమోడీ ఉన్నట్టుండి లక్షద్వీప్ పర్యటనకు ఎందుకు వెళ్ళినట్టు..? సరే వెళితే వెళ్ళారు. లక్షద్వీప్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్స్ లాంటివి పూర్తి చేసి తిరిగి వచ్చేయొచ్చు కదా..? సముద్ర తీరాల్లో తిరుగుతూ.. స్నార్కెలింగ్‌తో సముద్ర గర్భానికి వెళ్ళి రావడమేంటి..? బీచ్‌లో అందాలను అస్వాదిస్తూ ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేయడమేంటి..? ఇవన్నీ చేయడం వెనుక ఏదైనా రహస్య ఎజెండా ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్‌లో రెండు రోజుల పాటు పర్యటించారు. ఆ ప్రాంతంలో 1,150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అన్నింటికీ మించి ఆయన 70యేళ్ళ వయస్సులో స్నార్కెలింగ్‌తో సముద్రగర్భ అందాలను చూడటం.. ఆ చిత్రాలను Xలో షేర్ చేయడం సంచలనంగా మారింది. మోడీ టూర్‌లో ప్రారంభించిన పనుల కంటే.. లక్ష ద్వీప్ అందాలనే ఎక్కువ హైలెట్ చేశారు.
BRS: బీఆర్ఎస్ భవన్ వేదికగా రచ్చ.. కారు పార్టీలో భగ్గుమన్న విభేదాలు..
సముద్ర గర్భంలో స్విమ్మింగ్ చేయడం, బీచ్‌లో కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకోవడం.. నడుచుకుంటూ వెళ్ళడం.. ఇలాంటి ఫోటోలన్నీ Xలో షేర్ అయ్యాయి. లక్షద్వీప్ అందాలు, ఇక్కడి జనం చూపించిన ఆదరణకు ఫిదా అయినట్టు రాసుకొచ్చారు మోడీ. అంతేకాకుండా సాహసాలు చేయాలనుకునే వాళ్ళు.. లక్షద్వీప్‌ను మీ లిస్ట్‌లో చేర్చుకోండని సలహా ఇచ్చారు ప్రధాని మోడీ. ఇదంతా సహజం. మోడీ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి కామన్ అని అనుకుంటే పొరబడినట్టే. మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక సీక్రెట్ ఎజెండా ఉందంటున్నారు. దేశీయ పర్యటకాన్ని అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకంటే మన సినిమావాళ్ళు గానీ.. జనం గానీ.. సముద్ర తీర అందాలు చూట్టనికి తరుచుగా మాల్దీవులకు వెళ్తుంటారు. అక్కడి టూరిస్ట్ ప్లేసెస్‌లో తిరుగుతూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. సినిమాల షూటింగ్స్, పాటలను కూడా మాల్దీవుల్లోనే తీస్తుంటారు. కానీ మన దేశంలోనే ఉన్న సహజ అందాలపై వాళ్ళు దృష్టి పెట్టడం లేదు. అందుకే వాటిని చూపించాలి.. మన పర్యాటకానికి ఆదాయం తెచ్చిపెట్టాలన్నది మోడీ లక్ష్యం. ఇంకా చెప్పాలంటే.. మాల్దీవులకు మన దేశానికి ఇప్పుడు టర్మ్స్ అంత బాగోలేవు.
YS JAGAN: వైసీపీ మూడో జాబితా సిద్ధం.. పది మంది సిట్టింగ్‌లకు షాక్ తప్పదా..?
మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ మయిజ్జు పదవి చేపట్టిన తర్వాత ఇండియాతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆయన చైనాకి అనుకూలంగా.. ఇండియాకి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారు. అంతేకాదు.. మాల్దీవుల సైన్యానికి ఉపయోగపడే రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల్లో దాదాపు 70 మంది భారతీయ సైనికులు పనిచేస్తున్నారు. వాళ్ళందర్నీ వెళ్ళిపోవాలని ఆదేశాలిచ్చాడు మాల్దీవుల ప్రెసిడెంట్ మహ్మద్ మయిజ్జు. భారత దేశాన్ని, భారతీయులను అంతగా వ్యతిరేకిస్తున్నా.. మాల్దీవులను చూడటానికి మనం మాత్రం ఎందుకెళ్ళాలి..? అక్కడి టూరిజానికి మన డబ్బులు ఎందుకీయాలి. అదేదో మన లక్షద్వీప్‌ల్లో తిరిగితే సరిపోదా.. మన దేశానికి.. మన భారతీయులకే టూరిజం ద్వారా ఆదాయం లభిస్తుంది కదా. ఇది ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక ఉన్న సీక్రెట్ ఎజెండా. లక్షద్వీప్ లో పడగడపు దిబ్బలు అద్భుతంగా ఉంటాయి. బీచ్‌లు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. ఏ ద్వీపానికి వెళ్ళినా.. స్వచ్ఛమైన నీళ్ళు.. కొత్త అందాలు టూరిస్టుల మనస్సును దోచేస్తాయి. అగట్టి, కద్మత్, మినీకాయ్, కల్పేని, కవరత్తి దీవుల్లో అందమైన ప్రకృతి ఉంది. లక్షద్వీప్‌లో మొత్తం 36 ద్వీపాలుంటే.. వాటిల్లో పదింటిలో మాత్రమే జనం నివసిస్తారు. లక్షద్వీప్‌కు కేరళలోని కొచ్చి నుంచి విమానం ద్వారా అయితే గంటన్నరలో.. నౌకలో అయితే 14 నుంచి 18 గంటల్లో వెళ్ళవచ్చు.
కొచ్చి నుంచి ఎయిరిండియా.. వారానికి ఆరు రోజులు లక్షద్వీప్‌కు విమానాలు నడుపుతోంది. అక్కడ అగట్టిలో మాత్రమే ఎయిర్ పోర్ట్ ఉంది. అక్కడికి వెళ్ళాక… కవరత్తి, కద్మత్ దీవులకు పడవల్లో వెళ్ళాలి. దేశంలోని చిన్నదైన కేంద్ర పాలిత ప్రాంతం ఇది. అక్కడ టూరిజం అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మాల్దీవుల తరహాలో పర్యాటక స్వర్గంగా లక్షద్వీప్‌ను తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. అయితే జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని లక్షద్వీప్‌లోని 17 దీవుల్లోకి స్థానికులతో పాటు టూరిస్టులను కూడా నిషేధించారు. ఈ 17 దీవుల్లో జనావాసం ఉండదు. కొన్ని తాత్కాలిక నిర్మాణాలే ఉంటాయి. అక్కడ గతంలో ఉగ్రవాద, స్మగ్లింగ్ కార్యకలాపాలు జరిగేవి. దేశ సరిహద్దుల్లోని ఈ ప్రాంతాల్లో సంఘ విద్రోహశక్తులు నివాసం ఉంటే.. దేశ భద్రతకు ఇబ్బంది అని నిషేధించారు. త్వరలో వీటన్నింటినీ భారత్ ప్రభుత్వం తెరిచే అవకాశాలున్నాయి.
In addition to the scenic beauty, Lakshadweep's tranquility is also mesmerising. It gave me an opportunity to reflect on how to work even harder for the welfare of 140 crore Indians. pic.twitter.com/VeQi6gmjIM
— Narendra Modi (@narendramodi) January 4, 2024