Snorkelling : సముద్రం అడుగున సాహసం… మోడీకి ఎలా సాధ్యమైంది ?
Snorkelling : స్నోర్కెలింగ్ అనే పదం వినడం అందరికీ కొత్తగానే ఉంది. కానీ ప్రధాని నరేంద్రమోడీ... లక్ష్యద్వీప్ తీరంలో స్నోర్కెలింగ్ చేయడంతో ఇది పాపులర్ అయింది. రెండు రోజులుగా ఎక్కడ చూసినా ఇదేంటని వెతుకుతున్నారు జనం. సముద్ర గర్భంలోకి వెళ్ళి రావాలంటే చాలా గట్స్ ఉండాలి...ప్రధాని మోడీకి ఈ వయస్సు ఎలా సాధ్యమైంది ?
ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) లక్ష్యద్వీప్ తీరంలో స్నోర్కెలింగ్ ( Snorkelling) చేశారు. ఈ వయసులో ఆయన సముద్ర గర్భంలోకి వెళ్లి.. అక్కడి జీవరాశులను పరిశీలించి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన X లో ఓ ట్వీట్ చేశారు. 140 కోట్ల మంది ప్రజల కోసం తాను ఇంకా ఎంత కష్టపడాలో ఈ స్నోర్కెలింగ్ నేర్పింది అని. సాహసాలు చేయాలనుకుంటే… లక్ష్యద్వీప్ తీరంలో స్నోర్కెలింగ్ నేర్చుకోండి అని సూచించారు ప్రధాని మోడీ.
స్నోర్కెలింగ్ అంటే నదులు, సముద్ర గర్భంలోకి వెళ్లి.. అక్కడి జీవరాశుల ఎలా బతుకుతున్నాయో చూసి రావడమే. మనం సముద్రం లోపలికి వెళ్ళాలంటే ప్రత్యేక స్విమ్ సూట్ కావాలి. సముద్ర గర్భంలో వాతావరణం ఎలా ఉంది… సముద్ర జీవుల గురించి తెలుసుకోవచ్చు. అయితే మనం ప్రత్యేక సూట్ వేసుకోవడం వల్ల ఎక్కువ సేపు నీళ్ళల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. శ్వాస తీసుకోడానికి కూడా సమస్య ఉండదు. కళ్లు తెరిచి అన్ని జీవరాశులను చూడటానికి ఈ ప్రత్యేక స్విమ్ సూట్ ఉపయోగపడుతుంది. మోడీ కూడా ఇలాంటి సూట్ వేసుకొనే సముద్ర జలాల్లోకి వెళ్ళారు.
Chaddi Annam: అమెరికాలో చద్దన్నం.. రేటెంతో తెలిస్తే షాకవుతారు..
స్నార్కెలింగ్ కి వెళ్ళే సూట్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఇందులో స్విమ్మింగ్ గాగుల్స్ ఉంటాయి. డైవింగ్ మాస్క్, శ్వాస తీసుకోవడానికి ప్రత్యేక పరికరం ఉంటాయి. సముద్రం అడుగున ఉన్న నీళ్ళు శరీరానికి తగిలితే కొందరికి రాషెస్ వచ్చే ఛాన్సుంది. అలాంటి సమస్యలు రాకుండా ఈ ప్రత్యేకమైన సూట్ మన బాడీని కాపాడుతుంది. ఇందులో డ్రై, వెట్ సూట్స్ కూడా ఉంటాయి. కొందరైతే వాటర్ ప్రూఫ్ సూట్స్ వాడతారు. స్నోర్కెల్ సూట్ వేసుకొని నీళ్ళల్లోకి వెళ్ళిన వారు… అక్కడ కూడా నోరు, ముక్కుతో ఉపరితలంపైన ఉన్న గాలిని పీల్చుకోవచ్చు. అందుకోసం ప్రత్యేక ఎక్విప్ మెంట్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక పరికరం స్పియర్ ఫిషింగ్ , ఫ్రీ డైవింగ్ , ఫిన్స్ స్విమ్మింగ్ , అండర్ వాటర్ హాకీ , అండర్ వాటర్ రగ్బీ, స్కూబా పరికరాలతో ఉపరితల శ్వాస కోసం నీటి అడుగున కూడా ఉపయోగిస్తారు.
స్నోర్కెలింగ్ ప్రమాదమా ?
ప్రత్యేక సూట్ వేసుకున్న స్నోర్కెలర్స్ శ్వాస తీసుకునేటప్పుడు… పీల్చిన గాలిలో కొంత భాగాన్ని మళ్లీ పీలుస్తారు. అప్పుడు స్వచ్ఛమైన గాలి పరిమాణం తగ్గుతుంది. రక్తంలో కార్బన్ డయాక్సైడ్ పేరుకుపోయే చాన్సుంది. ఇది హైపర్‌క్యాప్నియాకు దారి తీయవచ్చు. ట్యూబ్ యొక్క వాల్యూమ్ ఎక్కువగా అయి… శ్వాస తీసుకునే చిన్న టైడల్ వాల్యూమ్ తక్కువ అవుతుంది. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావొచ్చు. అందువల్ల ప్రత్యేక స్నార్కెల్‌తో స్నార్కెల్ చేస్తున్నప్పుడు ముక్కు ద్వారా అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడం కార్బన్ డయాక్సైడ్ ఏర్పడటాన్ని కొద్దిగా తగ్గిస్తుంది. అందుకే ఎక్కువ సేపు స్నార్కెలింగ్ మంచిది కాదు. ఫిజీ దగ్గర్లోని పగడపు దిబ్బపై పగడాల మధ్య ఎక్కువ మంది స్నోర్కెలింగ్ చేస్తుంటారు. ఫిజీ దీవిలో ఇదో వినోద కార్యక్రమం. ఉష్ణ మండల ప్రదేశాల్లో స్నోర్కెలింగ్ కి క్రేజ్ ఉంది. స్నోర్కెలర్స్ నీటి అడుగు భాగంలోనే రగ్బీ, హాకీ లాంటి ఆటలు కూడా ఆడుతుంటారు.
For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.
During my stay, I also tried snorkelling – what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7
— Narendra Modi (@narendramodi) January 4, 2024