Bangladesh Election : బంగ్లాదేశ్ లో మొదలైన పోలింగ్.. ఢాకాలో ఓటు చేసిన షేక్ హసీనా.. భారత్‌కు ప్రధాని ధన్యవాదాలు

పొరుగు దేశం బంగ్లాదేశ్‌ నేడు జరిగే సాధారణ 12వ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ ఎన్నికలను బహిష్కరించాలంటూ 48 గంటల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 436 మంది స్వతంత్రులు సహా 27 రాజకీయ పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 7, 2024 | 11:21 AMLast Updated on: Jan 07, 2024 | 11:21 AM

Polling Started In Bangladesh Sheikh Hasina Who Voted In Dhaka Prime Minister Thanks India

పొరుగు దేశం బంగ్లాదేశ్‌ నేడు జరిగే సాధారణ 12వ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ ఎన్నికలను బహిష్కరించాలంటూ 48 గంటల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 436 మంది స్వతంత్రులు సహా 27 రాజకీయ పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

భారత పొరుగు దేశం బంగ్లా దేశ్ లో ఇలాళ ఉదయం 8. గంటలకు పోలింగ్ మొదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న 300 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. దేశ వ్యాప్తంగా 436 స్వతంత్రులు సహా 27 రాజకీయ పార్టీలకు చెందిన 1, 500 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ సాగుతుంది.

ఈ ఎన్నికల్లో దాదాపు.. 11.96 కోట్ల మంది ఓటర్లు 42 వేల పోలింగ్‌ స్టేషన్లలో ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికలను భారత్‌కు చెందిన ముగ్గురు.. సహా వంద మందికి పైగా విదేశీ పరిశీలకులు పోలింగ్‌ నిర్వహణ తీరును పరిశీలిస్తారు. ఈ నెల 8వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా ఢాకాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రధాన మంత్రి షేక్‌ హసీనా వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు.

దేశ రాజాధాని ఢాకాలో ఓటు వేసి అనంతరం మీడియతో మాట్లాడుతు భారత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో భావోద్వేగానికి గురయ్యారు. “షేక్ హసీనా భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘భారత్‌ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండడం మా అదృష్టం. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో వారు మాకు అండగా ఉన్నారు. 1975 తర్వాత మా కుటుంబం మొత్తాన్ని కోల్పోయినప్పుడు ఆశ్రయమిచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు నా శుభాకాంక్షలు’’ అని హసీనా వ్యాఖ్యానించారు.