Rahul Gandhi Nyay yatra: మణిపుర్ టు ముంబై… రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. గతంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా భారత్ జోడో యాత్రను చేపట్టారు. ఇప్పుడు ‘భారత్ న్యాయ యాత్ర’ పేరుతో మణిపుర్ నుంచి ముంబై వరకు చేపడుతున్నారు.
Rahul Gandhi: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టారు. కన్యాకుమారిలో మొదలుపెట్టిన ఈ పాద యాత్ర కశ్మీర్ దాకా కొనసాగింది. లోక్ సభ ఎన్నికల ముందు రాహుల్ మరో యాత్రకు సిద్ధమయ్యారు. ‘భారత్ న్యాయ యాత్ర (Bharat Nyay Yatra)’ పేరుతో దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకూ చేపడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మణిపూర్ నుంచి ముంబై దాకా హైబ్రిడ్ మోడ్ లో ఈ యాత్ర జరగబోతోంది.
RTC bus scheme : పురుషులను గౌరవిద్దాం..! వారి సీట్లలో వారినే కూర్చోనిద్దాం..!!
వచ్చే ఏడాది జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ యాత్ర నిర్వహిస్తున్నామని AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. మణిపుర్ (Manipur) నుంచి ముంబై (Mumbai) వరకు మొత్తం 6 వేల 200 కిలోమీటర్ల దాకా యాత్ర జరుగుతుంది. ఇందులో మహిళలు, యువత, బలహీన వర్గాల ప్రజలతో ఆయన మాట్లాడతారని చెప్పారు. మణిపుర్ నుంచి న్యాయ యాత్ర మొదలవుతుంది. నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్రకు చేరుకుంటుంది. ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో జరుగుతుంది. రాహుల్ గాంధీ చేపట్టి ఆ యాత్రం పూర్తిగా పాదయాత్ర కాదు. ఈసారి బస్సులోనూ ప్రయాణం చేస్తారు. మధ్యలో పాద యాత్ర కూడా చేస్తారని కేసీ వేణుగోపాల్ వివరించారు. 2022 సెప్టెంబరు 7న రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి ఐదు నెలల పాటు 4500 కిలోమీటర్లలో 12 రాష్ట్రాల్లో పాదయాత్ర చేశారు. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగుర వేసిన తర్వాత ఈ యాత్ర ముగిసింది.