Anant Ambani : అంబానీ ఇంట్లో చదివింపులు.. ఎవరెవరు ఎంతిచ్చారంటే..
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగింది. దేవుళ్ల పెళ్లి వేడుకలు కూడా ఇలా జరగవేమో అనే రేంజ్‌లో.. నభూతో అన్నట్లుగా వివాహతంతు సాగింది.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగింది. దేవుళ్ల పెళ్లి వేడుకలు కూడా ఇలా జరగవేమో అనే రేంజ్‌లో.. నభూతో అన్నట్లుగా వివాహతంతు సాగింది. దాదాపు 5 వేల కోట్ల ఖర్చుతో ఈ పెళ్లి జరిగింది. ఏడు నెలలుగా ఈ పెళ్లి ఉత్సవాలు జరుగుతున్నాయ్. ఇంకా ఆ హడావుడి మాత్రం తగ్గలేదు. త్వరలో లండన్‌లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తోంది అంబానీ ఫ్యామిలీ. అయితే పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు హాజరవ్వగా.. వారందరినీ చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
శుభ్ అశీర్వాద్ వేడుక పూర్తి అయ్యాక అంబానీ ఫ్యామిలీ ఒక్కో సెలబ్రిటీకి.. పర్సనల్‌గా థాంక్స్ చెప్పేందుకు కొన్ని గంటల పాటు స్టేజ్ మీద నిల్చునే ఉండి ఫిదా చేశారు. మొత్తానికి పెళ్లి ఖర్చు దాదాపు 5వేల కోట్లు అయిందని అంచనా ఉండగా… మరి కట్న కానుకలు ఏ విధంగా చదివించారనే ఆసక్తి నెలకొంది. ప్రజెంట్ దీనిపై ఫన్నీ మీన్స్ హల్చల్ చేస్తున్నాయ్. దేశమే కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్‌గా నిలిచిన ఈ పెళ్లి ఖర్చు.. అంబానీ ఆస్తిలో కేవలం 0.5 శాతం మాత్రమే. కాగా ప్రేక్షకులు దీన్ని పూర్ మ్యారేజ్‌గా లెక్కలేస్తున్నారు. ఈ పేద పెళ్లికి తమ వంతుగా 349 చెల్లించుకుంటున్నామని అంటున్నారు నెటిజన్లు.
ఈ లెక్క ఏంటని కంగారు పడకండి. ఈ మధ్యే జియో.. మంథ్లీ తారిఫ్ పెంచుతూ నిర్ణయంతీసుకుంది. దీంతో రీచార్జి ప్లాన్స్ భారీగా పెరిగాయ్. కొడుకు పెళ్లి ఖర్చు కవర్ చేసేందుకు.. ఇలా పెంచావా మావా.. పర్లేదు ఇదే నా కట్నం అంటూ 349 రూపాయల రీచార్జి స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. తమ తరపున ఇంత కట్నం అంటూ.. తాము ఇంత చెల్లించామని నెల రీఛార్జ్ డబ్బుల గురించి పోస్టులు పెడుతున్నారు. ఈ కట్నాలు, కానుకలు అంటూ.. రీచార్జిల రచ్చ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.