Samantha : సామ్ సెగలు.. స్విమ్ సూట్ లో సమంత
సమంత (Samantha) .. సమంత.. సమంత.. సోషల్ మీడియా మారుమోగిపోతోంది. వాస్తవానికి సామ్ ఏం చేసినా సంచలనమే.. అయితే లేటెస్ట్ గా ఆమె చేసిన ఫొటో షూట్ పై అంతకుమించి డిస్కషన్ జరుగుతోంది.

Samantha posted a photo for the cover page of Bazaar India magazine on her Instagram account and it went viral on social media
సమంత (Samantha) .. సమంత.. సమంత.. సోషల్ మీడియా మారుమోగిపోతోంది. వాస్తవానికి సామ్ ఏం చేసినా సంచలనమే.. అయితే లేటెస్ట్ గా ఆమె చేసిన ఫొటో షూట్ పై అంతకుమించి డిస్కషన్ జరుగుతోంది. సామ్ స్విమ్ సూట్ లో ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. సమంత బికినీ చేయడం కొత్తేంకాదు..గతంలో సూర్యతో కలసి నటించిన సికిందర్ మూవీకోసం ఆమె బికినీ వేసుకుంది. అయితే ఆ క్లిప్ ఫైనల్ ఎడిట్ లో డిలీట్ చేశారు. ఓ పాటలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది అంతే. ఆ మధ్య ఊ అంటావా మావా సాంగ్ లో హాట్ హాట్ గా కనిపించింది. సిల్వర్ స్క్రీన్ పై కొన్ని హద్దులు పెట్టుకున్నప్పటికీ ఫొటోషూట్స్, బ్రాండ్స్ ప్రమోషన్ విషయంలో తగ్గేదే లే అన్నట్టుంటుంది. లేటెస్ట్ గా ఓ మ్యాగజైన్ కోసం సమంత బికినీలో ఫొటో షూట్ చేసి షాకిచ్చింది.
Nandamuri Balakrishna: బాలీవుడ్‌లో బాలయ్య క్రేజ్.. అన్‌స్టాపబుల్ షోకి రణబీర్ కపూర్..!
బజార్ ఇండియా మ్యాగజైన్ (Bazaar India magazine) కవర్ పేజీకోసం దిగిన ఫొటోను సమంత తన ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపైనా రియాక్టయ్యింది. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా, పెళ్లి విఫలం అయింది, ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, విపరీతమైన నెగిటివ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నాను..వీటన్నింటి నుంచి బయటపడ్డాను. నటులంటే హిట్స్, అవార్డ్స్ గురించే కాదు కష్టాల గురించి కూడా బయటకు చెప్పాలంటుంది సామ్.
సమంత సిల్వర్ స్క్రీన్ పై బికినీ, స్విమ్ సూట్ వేయకపోయినా రొమాంటిక్ సీన్లు చేయడానికి వెనకడుగు వేయలేదు. ఈ ఏడాది థియేటర్లలో సందడి చేసిన ‘ఖుషి’ లో విజయ్ దేవరకొండ తో చేసిన సీన్స్ గురించి పెద్ద చర్చ జరిగింది. విడాకుల తర్వాత అంత అవసరమా అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. కానీ సామ్ అవేమీ పట్టించుకోలేదు. ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకూ వసూలు చేస్తున్న సమంత బ్రాండ్ ప్రమోషన్ కోసం కూడా కోట్లు రాబట్టుకుంటోంది. గతంలోనూ బార్బెర్రీ బ్రాండ్ కి చెందిన బికినీ ఫోజులిచ్చింది. ప్రస్తుతానికి షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్న సామ్..లేటెస్ట్ గా మ్యాగజైన్ కోసం బికినీ ఫొటో షూట్ చేసి నెట్టింట్లో మంటపెట్టింది సామ్..