KCR Security : కేసీఆర్‌కు భద్రత కుదింపు.. సీఎం రేవంత్ పంచ్ మామూలుగా లేదుగా..
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత వరుస నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపుతున్నారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రతిపక్షాలకు విమర్శించే ఛాన్స్ కూడా ఇవ్వకుండా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పరిపాలనలో పలు మార్పులు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు ఉన్న భద్రతను తగ్గించాలంటూ రేవంత్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత వరుస నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపుతున్నారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రతిపక్షాలకు విమర్శించే ఛాన్స్ కూడా ఇవ్వకుండా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పరిపాలనలో పలు మార్పులు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు ఉన్న భద్రతను తగ్గించాలంటూ రేవంత్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. దీన్ని వై కేటగిరీకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో ఇక నుంచి కేసీఆర్‌కు 4+4 గన్‌మేన్ సెక్యూరిటీ, ఒక పైలట్ వాహనం, ఎస్కార్ట్ వాహనం ఉండనుంది. ఇక నందిహిల్స్‌లోని ఆయన ఇంటి ముందు ఒక సెంట్రీని నియమించనున్నారు. కేవలం కేసీఆర్ మాత్రమే కాదు. చాలా మంది సెక్యూరిటీ విషయంలో మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే మాజీ మంత్రులకు ఉన్న సెక్యూరిటీని తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఎమ్మెల్యేలుగా గెలవనివాళ్లకు పూర్తిగా సెక్యూరిటీ కూడా తొలగించింది. ఇదే రీతిలో కేసీఆర్‌కు కూడా సెక్యూరిటీ తగ్గించేలా చర్చలు జరుగుతున్నట్టు టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అధికారుల్లో కూడా కీలక మార్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో కేసీఆర్‌కు దగ్గర పని చేసిన అధికారులందరూ ఇప్పుడు దాదాపుగా కీలక పదవులకు దూరం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు ముఖ్య పదవులకు సంబంధించిన అధికారులను ట్రాన్స్‌ఫర్ చేశారు. మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో ట్రాన్స్‌ఫర్‌లు జరగబోతున్నాయి.