Sonia Gandhi: సోనియా గాంధీకి ఇటలీలో ఇల్లు.. విలువ అంత తక్కువా..!
సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాన్ని వదులుకుని, రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ సందర్భంగా తన పేరిట ఉన్న స్తిర, చరాస్థుల గురించి వెల్లడించారు.
Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభకు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆమె.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాన్ని వదులుకుని, రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ సందర్భంగా తన పేరిట ఉన్న స్తిర, చరాస్థుల గురించి వెల్లడించారు. అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. సోనియా గాంధీ మొత్తం ఆస్తుల విలువ రూ.12 కోట్లుగా ఉంది.
Caste Census: తెలంగాణలో కులగణన.. బిల్లు ఆమోదించిన అసెంబ్లీ
ఇండియాలో ఇల్లు లేదు. అయితే, ఇటలీలో తండ్రి నుంచి వారసత్వంగా దక్కిన ఇల్లు ఉంది. 2014లో ఆ ఇంటి విలువ రూ.19.9 లక్షలుకాగా, ఇప్పుడా విలువ పెరిగింది. ప్రస్తుత అంచనా ప్రకారం ఆ ఇంటి విలువ దాదాపు రూ.26.83 లక్షలు. అంటే ఇండియాలోనే ఆ ధరకు చిన్న ఇల్లు మాత్రమే కొనుక్కోవచ్చు. అలాంటిది ఇటలీలో సోనియా గాంధీకి అంత తక్కువ విలువ కలిగిన ఇల్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.12.53 కోట్లు. ఢిల్లీలోని డేరా మండి గ్రామంలో సోనియా గాంధీకి మూడు బిగాల వ్యవసాయ భూమి ఉంది. సోనియా వద్ద రూ.కోటి విలువైన ఆభరణాలున్నాయి. ఇందులో 88 కిలోల వెండి, 1,267 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటితోపాటు ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చే రాయల్టీ, బాండ్లు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టబడుల ద్వారా ఆమె చరాస్తుల విలువ రూ.6.38 కోట్లు. వీటి ద్వారా వచ్చే ఆదాయం, వడ్డీ, ఎంపీగా పొందుతున్న వేతనమే తన జీవన వనరని సోనియా అఫిడవిట్‌లో తెలిపారు.
తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పేర్కొన్నారు. తన వద్ద రూ.90 వేల నగదు మాత్రమే ఉందని, సొంత కారు లేదని సోనియా గాంధీ తన అఫిడవిట్‌లో వివరించారు. విద్యార్హతలకు సంబంధించి సియానాలోని ఇస్టిటుటో శాంటా థెరిసా నుంచి ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో మూడేళ్ల విదేశీ భాషల కోర్సును 1964లో పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే, 1965లో కేంబ్రిడ్జ్‌లోని లెన్నాక్స్ కుక్ స్కూల్ నుంచి ఇంగ్లిష్‌లో సర్టిఫికేట్ కోర్సు చేసినట్లు వెల్లడించారు. అలాగే, సోషల్ మీడియాలో తనకు ఖాతా లేదని తెలిపారు.