Telangana BJP : తెలంగాణ బీజేపీని అమిత్ షా సెట్ చేస్తారా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు.. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందా.. అన్నంత వేవ్ నడిచింది. కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, కవిత అరెస్ట్ కాకపోవడం.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న టాక్, సీనియర్ నేతల మధ్య వర్గపోరు.. లాంటివి కమలం పార్టీని దెబ్బతీశాయి. ఈ వర్గ పోరు అనేది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కంటిన్యూ అవుతోంది. దాంతో లోక్ సభ ఎన్నికల కోసం శ్రేణులను రెడీ చేసేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్ కి వస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు.. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందా.. అన్నంత వేవ్ నడిచింది. కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, కవిత అరెస్ట్ కాకపోవడం.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న టాక్, సీనియర్ నేతల మధ్య వర్గపోరు.. లాంటివి కమలం పార్టీని దెబ్బతీశాయి. ఈ వర్గ పోరు అనేది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కంటిన్యూ అవుతోంది. దాంతో లోక్ సభ ఎన్నికల కోసం శ్రేణులను రెడీ చేసేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్ కి వస్తున్నారు. ఆయన వస్తే పార్టీలో గందరగోళానికి ఫుల్ స్టాప్ పడుతుందని శ్రేణులు భావిస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో 45 లోక్ సభ స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తెలంగాణలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చూస్తోంది. ఇక్కడి అభ్యర్థుల ఎంపిక బాధ్యతను స్వయంగా అమిత్ షాయే తీసుకుంటున్నారు. అందుకే పార్టీ లీడర్లు, కార్యకర్తలను రెడీ చేసేందుకు డిసెంబర్ 28న అమిత్ షా హైదరాబాద్ కి వస్తున్నారు. ఆ రోజు విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. అసెంబ్లీలో బీజేపీఎల్పీ నేత ఎన్నికపైనా డైలమా ఉంది. ఈ పోస్ట్ కోసం రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి కూడా అమిత్ షా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.
తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో ఎవరెవర్ని నిలబెట్టాలన్నదానిపై అమిత్ షా దే ఫైనల్ డెసిషన్ గా కనిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు.. ఆ తర్వాత.. రాష్ట్రంలో బీజేపీ లీడర్లు ఎవరికి వారే గ్రూపులుగా విడిపోయారు. నియోజకవర్గాల్లో సెకండరీ కేడర్ అయితే.. సీనియర్లకు వ్యతిరేకంగా సమావేశాలు కూడా పెడుతున్నారు. మరికొందరు.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో.. ఫలనా బీజేపీ లీడర్ కాంగ్రెస్ కు ప్రచారం చేశారంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఢిల్లీ పెద్దలకు సమర్పించారు. సీనియర్ నేతల్లో గందరగోళం వల్లే .. అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీ పూర్తిగా దెబ్బతిన్నదని బీజేపీ కార్యకర్తలు, అభిమానులు మండిపడుతున్నారు. తమ అవసరాల కోసం పార్టీ మారే వాళ్ళు, కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలను విమర్శించిన ద్రోహులకు టిక్కెట్లు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక కేడర్ అభిప్రాయాలను లెక్కలోకి తీసుకొని.. పార్టీ జెండా, ఎజెండా కోసం పనిచేసేవారికే ఎంపీ టిక్కెట్లు ఇవ్వాలంటున్నారు. మెదక్, మల్కాజ్ గిరి జిల్లాలకు చెందిన కొందరు బీజేపీ సీనియర్ నేతలు ఈ అంశాలను ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు వివరించినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఎంపీలు ముగ్గురు ఓడిపోయారు. ఈసారి గెలుస్తారా లేదా అన్నది కూడా డౌట్ గా ఉంది. పైగా తెలంగాణ బీజేపీ సీనియర్ నేతల్లో వర్గపోరు నడుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ వివాదాలు, సమస్యలను అమిత్ షా సెట్ రైట్ చేస్తారా ? నాయకులంతా కలసి పనిచేసేలా చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి. దానిపైనే బీజేపీకి తెలంగాణలో విజయవకాశాలు ఆధారపడి ఉంటాయంటున్నారు.