Microsoft Error : మైక్రో సాఫ్ట్ ఎఫెక్ట్… విమాన సేవలు బంద్
మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ తో ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలతో పాటు స్టాక్ మార్కెట్లు, బ్యాంకులు, హాస్పిటల్స్, మీడియా సంస్థల్లోనూ కార్యకలాపాలు ఆగిపోయాయి.
మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ తో ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలతో పాటు స్టాక్ మార్కెట్లు, బ్యాంకులు, హాస్పిటల్స్, మీడియా సంస్థల్లోనూ కార్యకలాపాలు ఆగిపోయాయి. అమెరికా సహా అనేక దేశాల్లో మైక్రో సాఫ్ట్ విండోస్ 10 సాఫ్ట్ వేర్ తో పనిచేసే కంప్యూటర్లన్నీ బంద్ అయ్యాయి. పీసీ, ల్యాప్ టాప్ స్క్రీన్లపై ఎర్రర్ మెస్సేజ్ లు వస్తున్నాయి. విండోజ్ యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అని కనిపిస్తోంది. స్క్రీన్స్ పై ఈ ఎర్రర్ మెస్సేజ్ కనిపించగానే… వెంటనే సిస్టమ్ షట్ డౌన్ అవుతోంది. కొన్నింటిలో రీస్టార్ట్ అవుతోంది.
అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు భారత్ లోనూ ఈ సమస్య తీవ్రంగా ప్రభావం చూసిస్తోంది. అన్ని చోట్లా ఆన్ లైన్ టికెట్ బుకింగ్, ఆన్ లైన్ సేవలు ఆగిపోయాయి. అమెరికాకు చెందిన ఫ్రంటీయర్ ఎయిర్ లైన్స్ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో సర్వీసులు నిలిచిపోయాయి. మన దేశంలోనూ ఈ ఎఫెక్ట్ పడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులోనూ సర్వర్లు ఆగిపోయాయి. ఆకాశ్ ఎయిర్ లైన్స్, స్పైస్ జెట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కొన్ని ఎయిర్ పోర్టుల్లో చోట్ల బోర్డింగ్ పాస్ లను మాన్యువల్ గా జారీ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్ వాడుతున్న లక్షల మందిపై ప్రభావం పడింది. విండోస్ 10 సాఫ్ట్ వేర్ క్రాష్ అయినట్టు నిపుణులు చెబుతున్నారు. కొత్త క్రౌడ్ స్ట్రైక్ అప్ డేట్ వల్లే ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. అది అసంపూర్తిగా లోడ్ అవడంతో… విండోస్ 10 దానికి సపోర్ట్ చేయట్లేదని నిపుణులు చెబుతున్నారు. తాము సమస్య పరిష్కారానికి పనిచేస్తున్నామనీ… ఇప్పటికే కొంత వరకూ సాల్వ్ చేశామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. చాలామంది సోషల్ మీడియాలో తమ కంప్యూటర్, ల్యాప్ టాప్స్ స్క్రీన్స్ ఫోటోలు తీసి పోస్ట్ చేస్తున్నారు.