THE KERALA STORY: ఇది అసలు కేరళ స్టోరీ.. నిమిషా ఫాతిమా ఏమైంది..?

అదాశర్మ పాత్రను ఓ అమ్మాయి కథ ఆధారంగా తీశారు. ది కేరళ స్టోరీ రీల్ స్టోరీ అయితే.. రియల్ కేరళ స్టోరీ నిమిషా అకా ఫాతిమా ఇషా అనే అమ్మాయిది. ఈమె రియల్ లైఫ్ ఆధారంగానే మూవీని నిర్మించారు. 2016 నుంచి 2018 మధ్యకాలంలో కేరళ నుంచి ఆఫ్గనిస్తాన్‌కు వెళ్ళిన అమ్మాయిల్లో ఫాతిమా ఒకరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 05:54 PMLast Updated on: Feb 21, 2024 | 5:54 PM

The Kerala Story Is Largely Based On The Cases Of Nimisha

THE KERALA STORY: కేరళ అమ్మాయిలకు బ్రెయిన్ వాష్ చేసి.. ఐసిస్ ఉగ్రవ్రవాద గ్రూపుల్లోకి చేర్చారన్న కథనంతో ది కేరళ స్టోరీ సినిమా ఏడాది క్రితం రిలీజైంది. ఈమధ్యే జీ5 OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ వర్గం వారు ఈ సినిమాను బ్యాన్ చేసినా.. OTTలో మాత్రం భారీగా రెస్సాన్స్ వస్తోంది. ఇందులో షాలినీ ఉన్నిక్రిష్ణన్ పాత్రలో ఆదా శర్మ నటించింది. కేరళలో 32 వేల మంది అమ్మాయిలను మతం మార్చి.. సిరియాలో అప్పట్లో పనిచేసిన ఐసిస్ ఉగ్రవాద సంస్థలోకి పంపారన్న ఆరోపణలు వచ్చాయి.

ALLU ARJUN-ATLEE: గెట్ రెడీ.. అల్లు అర్జున్‌తో అట్లీ.. త్వరలో ప్రకటన

ఈ ట్రూ స్టోరీస్ ఆధారంగానే సినిమా తీశామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. సినిమా విడుదలపై ఎంతో వివాదం నడిచింది. కానీ ఇది రియల్ స్టోరీ. అదాశర్మ పాత్రను ఓ అమ్మాయి కథ ఆధారంగా తీశారు. ది కేరళ స్టోరీ రీల్ స్టోరీ అయితే.. రియల్ కేరళ స్టోరీ నిమిషా అకా ఫాతిమా ఇషా అనే అమ్మాయిది. ఈమె రియల్ లైఫ్ ఆధారంగానే మూవీని నిర్మించారు. 2016 నుంచి 2018 మధ్యకాలంలో కేరళ నుంచి ఆఫ్గనిస్తాన్‌కు వెళ్ళిన అమ్మాయిల్లో ఫాతిమా ఒకరు. అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిరియాలో ఐసిస్ ఆధ్వర్యంలో ఉన్న ఖోరాసన్ ప్రావిన్స్‌కి నలుగురు అమ్మాయిలు వెళ్ళారు. నిమిషాతో పాటు సోనియా అలియాస్ అయేషా, మెరిన్ జాకబ్ అలియాస్ మరియం అక్కడికి వెళ్లారు. నిమిషా ఫాతిమా అసలు పేరు నిమిషా సంపత్. 2017లో తన కూతురు కనిపించడం లేదని ఆమె తల్లి బిందు సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిమిషాను బ్రెయిన్ వాష్ చేసి సిరియాకు తరలించారని ఆమె తల్లి అప్పట్లో కేరళ పోలీసులతో పాటు మంత్రులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి కూడా తీసుకొచ్చారు. తన బిడ్డను ఎలాగైనా ఆఫ్గనిస్తాన్ నుంచి తిరిగి ఇండియాకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

నిమిషా ఏదైనా తప్పుచేస్తే.. భారతీయ చట్టాల ప్రకారం శిక్షించవచ్చని కూడా విజ్ఞప్తి చేశారు. రెండు సార్లు కేరళ హైకోర్టును ఆశ్రయించినా నిమిషా జాడ మాత్రం తెలియలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లోని హైసెక్యూరిటీ జైల్లో నలుగురు భారతీయ మహిళలు ఉన్నారనీ.. వారిని విడిచి పెడతాం.. తీసుకెళ్ళమని అప్పట్లో ఆఫ్గాన్ ప్రభుత్వం భారత్‌ను కోరింది. కానీ వాళ్ళని తిరిగి ఇండియాకు తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ తర్వాత అధికారం చేపట్టిన తాలిబన్లు కూడా కేరళ అమ్మాయిలను అప్పగిస్తామని ప్రపోజ్ చేశారు. ఇండియా అంగీకరించలేదు. కానీ నిమిషా, ఆమె కూతురుతో పాటు వందల మంది ఐసిస్ ఉగ్రవాదులను ఆఫ్గన్ జైళ్ళ నుంచి విడుదల చేశారు తాలిబన్లు. అప్పటి నుంచి నిమిషా జాడ తెలియడం లేదు. ఆమె బతికి ఉందా.. ఆఫ్గనిస్తాన్‌లోనే కొత్త జీవితం గడుపుతోందా.. లేదంటే వేరే ఏదైనా దేశంలో ఆశ్రయం పొందుతుందా అన్నది తెలియడం లేదంటున్నారు ఆమె తల్లి బిందు సంపత్. ఇప్పటికైనా తన కూతురు జాడ కనిపెట్టాలని ఆమె కోరుతున్నారు.