Sudarshan Sethu : భారత దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. “సుదర్శన సేతు” నిండా.. భగవద్గీతలోని శ్లోకాల

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటిస్తున్నారు. ఈ రోజు ప్రధాని మోదీ అరేబియా సముద్రంలో బేట్ ద్వారకా (narendra Modi) ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగానికి కలిపే.. భారత దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు (Sudarshan Setu Bridge)బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద మోదీ (narendra Modi)ప్రారంభించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2024 | 12:08 PMLast Updated on: Feb 25, 2024 | 12:21 PM

The Longest Cable Bridge In India Sudarshan Setu Ninda Shlokas Of Bhagavad Gita

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటిస్తున్నారు. ఈ రోజు ప్రధాని మోదీ అరేబియా సముద్రంలో బేట్ ద్వారకా (narendra Modi) ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగానికి కలిపే.. భారత దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు (Sudarshan Setu Bridge)బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద మోదీ (narendra Modi)ప్రారంభించారు. మొదటగా ప్రధాని బీట్ ద్వారక లోని శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత మోదీ తన రోజును ప్రారంబించారు.

 

ఇక బేట్ ద్వారకా కు కొత్తగా నిర్మించిన నాలుగు లైన్ల తీగల వంతెనను ప్రాధని మోదీ ప్రారంభించారు. ఈ సుదర్శన్ సేతు బ్రిడ్జ్ కి ప్రత్యేకంగా.. ఈ వంతెనకు ఇరువైపులా శ్రీకృష్ణుని (srikrishna) చిత్రాల.. భగవద్గీతలోని శ్లోకాలతో అలంకరించబడిన ప్రత్యేకమైన నడక మార్గం ఉంది. ఇక 2.32 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణ వ్యయం రూ. 979 కోట్లతో పూర్తి చేశారు. మధ్యలో 900 మీటర్ల పొడవైన కేబుల్-స్టేడ్ స్పాన్, వంతెనపైకి చేరుకోవడానికి 2.45 కిలోమీటర్ల పొడవైన రహదారి ఉంది.

 

సుదర్శన్ బ్రిడ్జి ప్రత్యేకతలు మీకోసం…

  • 2017 అక్టోబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ వంతెనకు శంకుస్థాపన చేశారు.
  • సుదర్శన్ సేతు వంతెనను ఓఖా – బెట్ ద్వారకా బ్రిడ్జ్ గానూ పిలుస్తారు.
  • సుదర్శన్ సేతు ప్రత్యేకమైన డిజైన్లతో నిర్మాంచారు.
  • సుదర్శన్ సేతు భారత దేశంలోనే అతిపొడవైన సిగ్నేచర్ బ్రిడ్జిగా నిలిచింది.
  • ఈ వంతనెపై భగవద్గీతలోని శ్లోకాలు, రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలతో అలంకరించబడిన కాలిబాట కూడా ఉంది.
  • ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు 980కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు.
  • ఈ వంతెన డెక్ మిశ్రమ ఉక్కు – రీన్పోర్స్డ్ కాంక్రీటుతో తయారయింది.
  • ఈ వంతెన వెడల్పు 27.2 మీటర్లు (89 అడుగులు) ఉంటుంది. వంతెన ఇరువైపులా 2.5 మీటర్లు (8అడుగులు) వెడల్పు గల పుట్ పాత్ ఉంది.
  • ఈ వంతెన మొత్తం పొడవు 2,320 మీటర్లు (7,612 అడుగులు).
  • సుదర్శన్ సేతు ఫుట్ పాత్ పైభాగాల్లో సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
  • సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందిపడేవారు.
  • ఈ వంతెన కారణంగా లక్షద్వీప్ లో నివసిస్తున్న సుమారు 8,500 మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది.
  • గతంలో బేట్ ద్వారక కు చేరుకోవలంటే కేవలం పడవపైనే ఆధారపడాల్సి వచ్చేది.
  • ఈ వంతెన నిర్మితం కావడంతో భక్తులు.. కష్టాలు తీరనున్నాయి.