Sengol : రాజదండం పై మళ్లీ రగడ.. పార్లమెంటులో రాజదండం తీసేయండి
నూతన పార్లమెంట్ లో మళ్లీ మొదలైన రాజదండ రగడ.. లోక్‌సభలో రాజ దండాన్ని స్పీకర్ చైర్ పక్కన గోడకు అమర్చటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజదండానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్‌కే చౌదరీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

దీనికి కౌంటర్ గా.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఇండియా కూటమి తమిళ సంస్కృతిని ద్వేషిస్తోంది వ్యాఖ్యానించారు. భారతీయ చరిత్రను, తమిళ సంస్కృతిని సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి అగౌరవపరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముఖ్యంగా తమిళ సంస్కృతిపై ఇండియా కూటమిలో ఉన్న ద్వేషాన్ని కూడా చూపుతుందన్నారు. ‘సెంగోల్’ భారతదేశానికి గర్వకారణమని అన్నారు. అందుకే ప్రధాని మోదీ దానికి పార్లమెంటులో అత్యున్నత గౌరవం ఇవ్వడం గౌరవప్రదమైన విషయమని యోగి ఎక్స్‌లో రాసుకొచ్చారు.
గత ఏడాది మే 28న కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ కూర్చీ పక్కన, లోక్ సభ ఛాంబర్ లో ప్రదాని మోదీ సెంగోల్ ను ఏర్పాటు చేశారు. కాగా ఈ సెంగోల్ సుమారు ఆగస్టు 14, 1947 రాత్రి భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూచే ఆమోదించబడింది. ఈ “సెంగోల్” సుమారు ఐదు అడుగుల పొడవు, విలువైన రాళ్లతో అమర్చబడి.. అలంకరించబడి.. పై భాగంలో బంగారు గోళం పొందుపొడిచి ఉంటుంది.