Telangana Elections : తెలంగాణ ఎన్నికలపై వెయ్యి కోట్ల బెట్టింగులు..
అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో మెజార్టీ సంస్థలు ఒక పార్టీకే జైకొట్టినా.. కొన్ని సంస్థలు మాత్రం అధికారం మరోసారి అధికార పార్టీదే అని తేల్చేశాయి. ఇక కొన్ని సంస్థలు మాత్రం రాష్ట్రంలో హంగ్ తప్పదని.. బీజేపీ కింగ్ మేకర్‌గా మారే ఛాన్స్ ఉందని చెప్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలపై ఏపీలో ఓ రేంజ్‌లో బెట్టింగ్ నడుస్తోంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది?
అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో మెజార్టీ సంస్థలు ఒక పార్టీకే జైకొట్టినా.. కొన్ని సంస్థలు మాత్రం అధికారం మరోసారి అధికార పార్టీదే అని తేల్చేశాయి. ఇక కొన్ని సంస్థలు మాత్రం రాష్ట్రంలో హంగ్ తప్పదని.. బీజేపీ కింగ్ మేకర్‌గా మారే ఛాన్స్ ఉందని చెప్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలపై ఏపీలో ఓ రేంజ్‌లో బెట్టింగ్ నడుస్తోంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? ఏ సెగ్మెంట్‌లో ఎంత మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది? హంగ్ వస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి అంశాలపై బెట్టింగులు కాస్తున్నారు పందెం రాయుళ్లు. బెట్టింగ్‌లకు పాపులరైన భీమవరంలో అయితే కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని భీమవరం, నరసాపురం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లిగూడెంతో పాటు విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ కోట్లలో బెట్టింగ్ రాయుళ్లు.. సై అంటే సై అంటున్నారు.
Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా..? రియల్టర్లు, కాంట్రాక్టర్ల బేజార్..!
తెలంగాణలో బెట్టింగ్‌లపై పోలీసుల నిఘా ఉండడంతో.. ఏపీతో పాటు ఇతర ప్రాంతాల్లో బుకీలు బెట్టింగ్ దందాను నడిపిస్తున్నారు. ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నుంచి బెట్టింగ్‌లు కలుపుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇంగ్లండ్‌లోని ప్రధాన నగరాల నుంచి యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు జరుగుతున్నాయని తెలుస్తోంది. పందేలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పే భీమవరంలో.. ఏకంగా రెండు వందల కోట్ల మేర బెట్టింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇలా బెట్టింగులు కాస్తున్నవారిలో రాజకీయ నేతలు, ఇండస్ట్రియలిస్ట్‌లతో పాటు.. బడా వ్యాపారులు, సామాన్యులు కూడా ఉన్నారు. ఓ పార్టీ గెలుపు.. లేదా కీలక నేత గెలుపై బెట్టింగ్ వేస్తసే.. లక్షకు రెండు లక్షలు, కోటికి రెండు కోట్లు అంటూ పర్సెంటేజీ నడుస్తోంది. ఇలా చాలా అంశాలపై బెట్టింగులు జరుగుతున్నాయి.
బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? తొలిసారి కాంగ్రెస్ గెలుస్తుందా? అన్నదానిపై ప్రధానంగా బెట్లు కడుతున్నారు. సీఎం అయ్యేది కేసీఆరా? కాంగ్రెస్ లీడరా? అనేదానిపైన కూడా కోట్లలో బెట్లు నడుస్తున్నాయి. ఈసారి తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎంఐఎం ఎప్పటిలానే ఏడు సీట్లు గెలుస్తుందా? లేదా? అనేదానిపైనా జోరుగా పందేలు సాగుతున్నాయి. కామారెడ్డి, గజ్వేల్‌లో గెలుపెవరనేదానిపై చాలా మంది బెట్లు కడుతున్నారు. అటు కామారెడ్డి, గజ్వేల్ రెండు చోట్ల కేసీఆర్ గెలుస్తారా? లేదా అనేదానిపై కూడా భారీగా పందేలు ఆడుతున్నారు. ఇక కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ లాంటి కీలక నేతల మెజార్టీ మీద కూడా ఓ రేంజ్‌లో బెట్టింగులు జరుగుతున్నాయి. కొంతమంది ప్రత్యేకంగా సర్వే నివేదికల ఆధారంగా బెట్లు కడుతున్నారు.
ఇందుకోసం ఏజెన్సీలతో కొంతమంది సర్వేలు చేయిస్తే, మరికొంతమంది సర్వే నివేదికలను కొనుక్కుని మరీ పెద్ద మొత్తంలో పందేలు కాస్తున్నారు. ఈజీ మనీ కావడంతో జోరుగా బెట్లు కడుతున్నారు. నగదుతో పాటు ఇల్లు, పొలం, స్థలాలను బెట్టింగ్‌లో పెడుతున్నారు. నరసాపురానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త అయితే ఏకంగా సర్వే చేయించుకుని మరీ బెట్టింగ్ బరిలోకి దిగారట. మొత్తానికి తెలంగాణ ఎన్నికలు బెట్టింగ్ రాయుళ్లకు మంచి బిజినెస్‌గా మారాయి.