ఇవాళే మౌని అమావాస్య ఇవాళ ఈ పనులు చేస్తే మీకు జీవితంలో తిరుగుండదు

దేశంలో దాదాపు ప్రతీ ఒక్కరి ప్రయాణం ప్రయాగ్‌రాజ్‌ వైపే సాగుతోంది. జీవితాన్ని కష్టంగా ఫీలైన ప్రతీ ఒక్కరూ కుంభమేళా వైపే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే కుంభమేళా త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అనేది ప్రతీ హిందువు నమ్మకం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2025 | 03:42 PMLast Updated on: Jan 30, 2025 | 3:43 PM

Today Mouni Amavasya Intersting Facts

దేశంలో దాదాపు ప్రతీ ఒక్కరి ప్రయాణం ప్రయాగ్‌రాజ్‌ వైపే సాగుతోంది. జీవితాన్ని కష్టంగా ఫీలైన ప్రతీ ఒక్కరూ కుంభమేళా వైపే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే కుంభమేళా త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అనేది ప్రతీ హిందువు నమ్మకం. అది కూడా మౌని అమావాస్య రోజు మాహాకుంభమేళాలో పుణ్య స్నానం చేస్తే.. జన్మ జన్మల పుణ్యం వస్తుంది అని ప్రతీ ఒక్కరూ నమ్ముతుంటారు. అంత ప్రధాన్యత ఉన్న మౌని అమావాస్య రోజు ఎలాంటి పనులు చేస్తే మంచిది. ఎలాంటి పనులకు దూరంగా ఉండాలి అనేది ఒకసారి తెలుసుకుందా. కుంభమేళాలో ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే జనవరి 29న శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య రావడం మరో ఎత్తు. ఈరోజుకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ శుభ ముహుర్తంలో పుణ్యస్నానం ఆచరించాలని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని, రాజ స్నానం తర్వాత దానధర్మాలు చేస్తే కచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. అనంతరం శివయ్యను స్మరించుకుంటూ, తమ పూర్వీకులకు నీరాజనాలు అర్పిస్తారు. ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున మునులు మౌనంగా ఉంటారు. మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మ శాంతి కోసం శ్రాద్ధ కర్మలు, తర్పణం చేయాలి. తెల్లవారుజామునే స్నానాలు చేస్తే అనుకూల పరిణామాలు ఉంటాయి. ఈ సమయంలో వీలు కాని వారు తర్వాత కూడా స్నానం చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు రాత్రి 9:22 గంటల వరకు సిద్ధి యోగం కూడా ఉంటుంది.

ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మౌని అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయాలి. ఈ పర్వదినాన శ్రీహరి లక్ష్మీదేవిని, గంగామాతను పూజించాలి. మౌని అమావాస్య రోజున మౌన ఉపవాస దీక్షను ఆచరించాలి. వేళ సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు అర్ఘ్యంగా సమర్నపించి ‘ఓం పితృ దేవతాయై నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఈ సారి శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య వచ్చింది. ఇదే సమయంలో మహా కుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఈరోజు చేసే దానధర్మాల వల్ల మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు డబ్బుకు లోటు అనేదే ఉండదు. పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తర్పణాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.

ఈ పర్వదినాన పేదలకు మీ శక్తి, సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. అలాగే పేదలకు ఉన్ని దుస్తులు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో కూడా సుఖశాంతులు లభిస్తాయి. జ్యోతిష్యం ప్రకారం,ఈసారి మౌని అమావాస్య వేళ చంద్రుడు, సూర్యుడు మకర రాశిలో ఉంటారు. అంతేకాదు శ్రవణా నక్షత్రంలో మౌని అమావాస్య వచ్చింది. ఇదే సమయంలో గురుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో మహా కుంభ మేళాలో రాజస్నానం కూడా చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ తొలి అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు మౌని అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు. అందుకే ఈరోజున ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే, వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు చెబుతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.