బ్రేకింగ్: మళ్ళీ ఆస్పత్రిలో చేరిన అద్వానీ…!

బిజెపి అగ్ర నేత ఎల్‌కె అద్వానీ ఈరోజు ఢిల్లీలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న అద్వానీ… గత నెలలో కూడా ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. రెండు రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచిన తర్వాత ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఆయన్ను అడ్మిట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే నేడు మళ్ళీ స్వల్ప ఆశ్వస్తతకు గురి కావడంతో అపోలో ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆయనకు న్యూరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి ఆధ్వర్యంలో వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం అద్వాని ఆరోగ్యం నిలకడగా ఉందని జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. వయసు సంబంధిత సమస్యలతో అద్వానీ బాధ పడుతున్నారని అందుకే ఆయన్ను ఆస్పత్రిలో జాయిన్ చేసినట్టు తెలుస్తోంది.