Why Rahul : రాహుల్ గాంధీ అమేథిని.. ఎందుకు వదిలేశాడు?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సడన్ గా రాయ్ బరేలీ నుంచి పోటీకి దిగారు. ఆల్రెడీ కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 3, 2024 | 05:13 PMLast Updated on: May 03, 2024 | 5:13 PM

Why Did Rahul Gandhi Leave Amethi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సడన్ గా రాయ్ బరేలీ నుంచి పోటీకి దిగారు. ఆల్రెడీ కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో తన కంచుకోట అమేథీని విడిచిపెట్టి రాయ్ బరేలీకి వెళ్ళి కంటెస్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పాతికేళ్ళ చరిత్రలో గాంధీ కుటుంబం అమేథీ నుంచి బరిలోకి దిగకపోవడం ఇదే ఫస్ట్ టైమ్. వాయనాడ్ లో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ… మళ్ళీ రాయ్ బరేలీని ఎందుకు ఎంచుకున్నట్టు… ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Narendra Modi), అమేథీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ (MP Smriti Irani) ఆరోపించినట్టుగా… వాయ్ నాడ్ (Wayanad) లో ఓడిపోతానని రాహుల్ కి భయం పట్టుకుందా ? తన సొంత నియోజకవర్గం కాదని… మొన్నటిదాకా తన తల్లి సోనియా గాంధీ ఎంపీగా ఉన్న సీటును ఎంచుకోవడం ఏంటి

అమేథీ (Amethi) లోక్ సభ (Lok Sabha Elections) నియోజకవర్గంలో 1967లో ఏర్పడింది… అప్పటి నుంచి గాంధీ ఫ్యామిలీ 31 యేళ్ళుగా అక్కడ గెలుస్తోంది. మధ్యలో 1998లో ఒకసారి సతీష్ శర్మ పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 1999లో సోనియా గాంధీ 3 లక్షల ఓట్ల మెజారిటీ గెలిచారు. కానీ 2004లో తన కొడుక్కి అమేథీ సీటు ఇచ్చేందుకు సోనియా అక్కడి నుంచి రాయ్ బరేలీకి షిప్ట్ అయ్యారు. 2004, 2009, 2014లో మూడు సార్లు రాహుల్ అమేథీ నుంచి విజయం సాధించారు. ఇక 2019లో జెయింట్ కిల్లర్ లాగా వచ్చి కేంద్రమంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ…. రాహుల్ గాంధీని ఘోరంగా ఓడించారు. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో 55 వేలకు పైగా ఓట్ల తేడాతో రాహుల్ ఓడిపోయారు.

ఆ ఓటమి భయం నుంచి రాహుల్ గాంధీ ఇంకా కోలుకున్నట్టు లేదు. అందుకే మళ్ళీ ఓడిపోతానన్న భయంతో అమేథీ కాకుండా… తన తల్లి మొన్నటి దాకా ఎంపీగా ఉన్న రాయ్ బరేలికి షిప్ట్ అయినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సేఫ్ సీటు చూసుకోవడం ఇప్పుడు బీజేపీకి ఆయుధంలా దొరికింది. అమేథీ నుంచి రాహుల్ పారిపోయాడంటూ… ప్రధాని మోడీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇప్పటికే విమర్శలు చేశారు. వాయ్ నాడులో ఓడిపోతానన్న భయంతోనే రాయ్ బరేలీలో దిగారని ఆరోపిస్తున్నారు. ఇప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ప్రచారం చేయబోతోంది బీజేపీ. ఈ పరిస్థితి కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమికి కూడా పెద్ద దెబ్బే.

కేరళలో వాయనాడ్ లో పోటీ చేయొద్దని కమ్యూనిస్టు పార్టీలు రాహుల్ గాంధీని రిక్వెస్ట్ చేశాయి. ఆయన వినకపోవడంతో ఈసారి ఎలాగైనా ఓడించాలని డిసైడ్ అయ్యాయి. రాహుల్ కేరళను వదులుకోకపోవడానికి బలమైన కారణం ఉంది. 2026లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఏ పార్టీ లేదా కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అందుకే ఈసారి కాంగ్రెస్ వస్తుందన్న ఆశ ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

రాయ్ బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేయకపోవడానికి కొన్ని కారణాలను కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గాంధీ కుటుంబం నుంచి ముగ్గురూ పోటీలో ఉండటం కరెక్ట్ కాదనుకున్నారు. రాహుల్, ప్రియాంక గెలిస్తే… ఇప్పటికే సోనియా కూడా రాజ్యసభ ఎంపీగా ఉండటంతో… వారసత్వ రాజకీయాలు అంటూ బీజేపీ టార్గెట్ చేస్తుంది. అందుకే ప్రియాంక బరిలోకి దిగనట్టు సమాచారం. అయితే రాహుల్… వాయ్ నాడు కాకుండా… రాయ్ బరేలీలో దిగడానికి మరో కారణం ఉంది. హిందీ రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ పాతుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో హిందీ బెల్ట్ స్టేట్ అయిన యూపీలో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భయంతో రాహుల్ ని దింపినట్టు చెబుతున్నారు.

2019లో అమేథీ సీటు దక్కించుకున్న స్మృతి ఇరానీ అక్కడ బాగా పాతుకుపోయారు. గౌరీ గంజ్ లో ఇల్లు కట్టుకొని అక్కడ లోకల్ సిటిజన్ గా మారిపోయారు. అదీ కాక… అమేథీ లోక్ సభ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే… అందులో మూడింటిలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. గౌరీ గంజ్ నుంచి గెలిచిన ఒక్క SP ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కూడా ఇరానీకి సపోర్ట్ చేస్తున్నారు. దాంతో అమేథీలో బీజేపీకి గట్టి హోల్డ్ ఉంది. రాహుల్ గాంధీని అమేథీ ప్రజలు వీఐపీ గాంధీ అని పిలుస్తున్నారంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఆలోచించే… రాహుల్ సేఫ్ సైడ్ గా రాయ్ బరేలీకి జంప్ అయినట్టు తెలుస్తోంది.