BABU TO DELHI : బీజేపీతో పొత్తు ఉంటుందా ? బాబుకు ఢిల్లీ పిలుపు ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఉంటుందా... ఏపీ పొలిటికల్ (AP Political) సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే టాక్ నడుస్తోంది. పొత్తుల సంగతి తేలుద్దామంటూ బాబుకు బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. దాంతో ఆయన బుధవారం రాత్రి హస్తినకు వెళ్తున్నారు. గురువారం నాడు బీజేపీ సీనియర్లు అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరపబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఉంటుందా… ఏపీ పొలిటికల్ (AP Political) సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే టాక్ నడుస్తోంది. పొత్తుల సంగతి తేలుద్దామంటూ బాబుకు బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. దాంతో ఆయన బుధవారం రాత్రి హస్తినకు వెళ్తున్నారు. గురువారం నాడు బీజేపీ సీనియర్లు అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరపబోతున్నారు. టీడీపీ(TDP) తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ కోరుకుంటోందనీ… అందుకే ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నాయుడు గురువారం నాడు బీజేపీ (BJP) పెద్దలతో భేటీ అవబోతున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పొత్తుపై బీజేపీ నేతలతో ఆయన చర్చిస్తారు. ఏపీలో ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుంది టీడీపీ. అయితే తాము NDAలోనే కొనసాగుతున్నట్టు పవన్ కల్యాణ్ చెబుతూనే ఉన్నారు. దీనికితోడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి సహా అక్కడి కమలం నేతలంతా తమ పార్టీ కూడా కూటమిలో చేరాలని కోరుకుంటున్నారు. టీడీపీ తనంతట తాను పొత్తు కోసం చేయిసాచాలని బీజేపీ భావించింది. కానీ అది జరక్కపోవడంతో చివరకు బీజేపీ పెద్దలే బాబును ఢిల్లీకి పిలిచారు.
బాబు-అమిత్ షా (Babu-Amit Shah) మధ్య జరిగే భేటీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) కూడా పాల్గొనే అవకాశముంది. జనసేన-టీడీపీ (Janasena-TDP) తో కలిసి పోటీ చేసేదీ లేనిదీ ఈ మీటింగ్ లో బీజేపీ తేల్చి చెబుతుందని భావిస్తున్నారు. అలాగే బీజేపీతో పొత్తు లేకపోతే ఫలితం ఎలా ఉంటుందో కూడా చర్చించే అవకాశముంది. ఉమ్మడి రాష్ట్ర విభజన, ఏపీకి స్పెషల్ స్టేటస్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అక్కడి ప్రజలు బీజేపీ మీద కోపంగా ఉన్నారు. అందువల్లో టీడీపీ, జనసేనతో కలవకుండా ఉంటేనే బెటర్ అన్న అభిప్రాయం తెలుగుదేశం సీనియర్ నేతల్లో వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కమలం పార్టీతో పొత్తులపై మొన్నటిదాకా చంద్రబాబు తొందరపడలేదు. అయితే ఇప్పుడు అమిత్ షాతో జరిగే చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. కలిసి పోటీ చేస్తే నష్టమని ఇద్దరు నేతలు భావిస్తే… బీజేపీతో పొత్తుకు టీడీపీ-జనసేన దూరంగా ఉండే అవకాశాలున్నాయి. అంతేకాదు… లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాక… NDAలోకి టీడీపీ-జనసేన చేరడంపై ఓ అంగీకారానికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ ఒప్పందంతో బీజేపీ లేకుండా ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు వెళ్ళే అవకాశముంది. గురువారం జరిగే బాబు- అమిత్ షా మీటింగ్ తో ఏపీలో పొత్తులపై క్లారిటీ రానుంది.