Andhra Pradesh Congress : ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు.. ఏపీ అధ్యక్ష పగ్గాలు వైఎస్ షర్మిలకే..?

దేశంలో కాంగ్రెస్ పరిస్థి ఎలా ఉంది అంటే.. ఉత్తరాదిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతున్న.. దక్షిణాదిలో మాత్రం కాంగ్రెస్ పుంజుకుంటుంది. మొన్న కర్ణాటక.. నేడు తెలంగాణ ఈ కోవలోకే వస్తాయి. ఇక తెలంగాణ విజయం పొంది.. ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్.. ఇక ఏపీ వైపు తన దిశా మర్చింది. తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగాంగానే వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2023 | 11:08 AMLast Updated on: Dec 27, 2023 | 11:08 AM

Ys Sharmila As The President Of Andhra Pradesh Congress Party

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ఏఐసీసీ ఆధ్వర్యంలో ఏపీలో జరుగుతున్న పరిస్థితులపై కీలక సమావేశం జరగనుంది. ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఉదయం 11. 00 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ఏఐసీసీ పెద్దలు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ముఖ్య నేతగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరు ఏపీసీసీ నేతలతో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పై చర్చించనున్నారు.

దేశంలో కాంగ్రెస్ పరిస్థి ఎలా ఉంది అంటే.. ఉత్తరాదిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతున్న.. దక్షిణాదిలో మాత్రం కాంగ్రెస్ పుంజుకుంటుంది. మొన్న కర్ణాటక.. నేడు తెలంగాణ ఈ కోవలోకే వస్తాయి. ఇక తెలంగాణ విజయం పొంది.. ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్.. ఇక ఏపీ వైపు తన దిశా మర్చింది. తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగాంగానే వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవాలంటే కాంగ్రెస్ కు ఉన్న ఏకైక మార్గం.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించాలి. కాగా వారు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకంపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశముంది. గతంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో షర్మిల కావడంతో.. పలు మార్లు ఈ వార్తలు వచ్చిన అవి ఎటు స్పష్టత రాలేదు.

గతంలో ఏపీలో వైఎస్ షర్మిల గురించి.. ‘‘మాకు సమయం ఎక్కువగా లేదు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరితే ఏపీలో కాంగ్రెస్‌తో పాటు ఆమె భవితవ్యం కూడా బాగుంటుందని భావిస్తున్నాం’’ అని ఒక కాంగ్రెస్‌ నేత అన్నారు” ఈ విషయం అందరికి తెలిసిందే.. ఇదే విషయంపై ఏఐసీసీ అదిష్టానం కూడా పుణరాలోచన చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. కాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మాణిక్కం ఠాగూర్‌కు కూడా ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.