France: కార్చిచ్చు రేపిన కారు ప్రయాణం.. ఐదు రోజులుగా తగలబడిపోతున్న ఐరోపా దేశం (డైల్ న్యూస్ ఎక్స్ క్లూజివ్)
పారిస్ లో మారణహోమం తలెత్తుతోంది. ఒక టీనేజర్ చేసిన తప్పుకు పోలీసులు ప్రవర్తించిన తీరుకు ఈ నిరసన జ్వాలలు చలరేగాయి. ఐరోపా దేశంలోని ఫ్రాన్స్ నగర టీనేజర్స్ రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారు. వీరిని అదుపుచేసేందుకు రక్షణ రంగ అధికారులు 18 వేల మంది సైనిక సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ గడిచిన ఐదు రోజులుగా పరిస్థితి శాంతించడం లేదు.

మారణ హోమాన్ని తలపిస్తున్న ఫ్రాన్స్ నగరం

టీనేజర్లు ఎక్కువగా రోడ్డుపైకి వచ్చి ఈ చర్యలకు పాల్పడుతున్నారు

ఒక చిన్న తప్పిదం ఇంతటి విధ్వంసకరంగా మారడానికి కారణం

ట్రాఫిక్ చెక్ పాయింట్ వద్ద పోలీసులు కారును ఆపమని ఆదేశించారు.

ఇది పట్టించుకోని పిల్లవాడు కారు ఆపకుండా వేగంగా డ్రైవ్ చేశాడు

అలా స్థానికులపైకి వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేశాడు. అంటే రాష్ డ్రైవింగ్ అనమాట.

దీంతో పోలీసులు అతనిని నిలువరించడం కోసం కాల్పులు జరిపారు

ఈ కాల్పుల్లో ఆ పిల్లవాడు చనిపోయాడు

ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్రాన్స్ నగర యువత ఎదురుదాడికి పాల్పడ్డారు

పోలీసులతో, సామాన్యులతో ఎవరిని పడితే వారిని చేతికి దొరికింది తీసుకొని కొడుతున్నారు

కొన్ని ప్రాంతాలకు నిప్పుపెట్టారు

మరి కొన్ని భవనాలను తగులబెట్టేశారు

ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తి చిన్న షాప్ వద్ద కూర్చొని ఆకలి తీర్చుకుంటున్నాడు

ఒకవైపు ఫైరింజన్ కు సైతం అదుపులోకి రాని మంటలు.. మరో వైపు యువకుల దాడులు.

ఇంతటి భయానక పరిస్థితుల నడుమ కూర్చొని సాండ్విచ్ తిని నీళ్లు తాగుతున్న వ్యక్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

పోలీసుల ఎదురు కాల్పులు

దీపావళి బాణాసంచా పేల్చినట్లుగా అక్కడి వాతావరణం మారిపోయింది

కొందరు మంటల్లో చిక్కుకొని కాలిపోయారు.