Tirupati Fire Accident: గోవిందరాజ స్వామి ఆలయం వద్ద తగలబడిన లావణ్యాస్ ఫోటో షాపు
తిరుపతి గోవింద రాజ స్వామి ఆలయం వద్ద తీవ్రమైన మంటలు వ్యాపించాయి. ప్రముఖ లావణ్యాస్ ఫోటో షాపులో షాట్ సర్క్యూట్ కారణంగా ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు ప్రాదమికంగా నిర్థారించారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు. దాదాపు 10 ఫైరింజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రూ. 5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు.

తిరుపతి గోవింద రాజ స్వామి గుడి వద్ద భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది

చుట్టుపక్కల ప్రాంతం మొత్తం దట్టమైన నల్లని పొగతో నిండిపోయింది

మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు

షాట్ సర్క్యూట్ కారణంగా ఇలా జరిగినట్లు పోలీసులు ప్రాదమికంగా నిర్థారంచారు

మంటలకు కాలి బుగ్గి అయిన బైక్

లావణ్యాస్ అనే ప్రముఖ ఫోటో షాపులో ఈ ఘటన చోటు చేసుకుంది

దేవతా ప్రతిమలు మొత్తం తగులబడిపోయాయి

మంటలు గోవిందరాజ స్వామి రథానికి వ్యాపించడంతో స్థానికులు పక్కకు జరిపారు

ఆలయ గోపురం ఏమాత్రం కనిపించకుండా కమ్మేసిన పొగలు

గ్రౌండ్ ఫ్లోర్ తో పాటూ మూడు అంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి

దాదాపు 10 ఫైరింజన్లను తీసుకొచ్చి సాయంత్రం వరకూ మంటలు ఆర్పేందుకు కృషి చేశారు

స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దగ్గరుండి పరిస్థితి సర్థుమణిగేలా ఏర్పాట్లు చేశారు

దాదాపు రూ. 5 కోట్ల మేరా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది