Home »Photo-gallery » A Sky Walk Bridge Was Constructed At Uppal Kudali So That Pedestrians Do Not Face Any Problem Due To Traffic
Uppal: హైదరాబాద్ సిగలో మరో నగ.. ఉప్పల్ కూడలి వద్ద స్కై వాక్ ఏర్పాటు..
హైదరాబాద్ : ఉప్పల్ రింగ్ రోడ్డులో పాదచారుల కష్టాలకు చెక్ చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం స్కైవాక్ ఏర్పాటు చేసింది. దీనిని సోమవారం మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మినిస్టర్ కేటీఆర్ హాజరయ్యారు. దాదాపు రూ. 25 కోట్లతో స్కైవాక్ బ్రిడ్జి నిర్మించారు. ఎక్కడా క్రింద నుంచి ట్రాఫిక్ నడుమ రోడ్డు దాటే అవసరం లేకుండా బ్రిడ్జ్ పై నుంచి వెళ్లొచ్చు. ఈ స్కై వాక్ పొడవు 665 మీటర్లు.. వెడల్పు 4 మీటర్లు కాగా 6 మీటర్ల ఎత్తులో దీనిని కట్టడం జరిగింది. బస్ స్టాప్, మోట్రోకు అనుసంధానం చేస్తూ ఇందులో మొత్తం 8 లిఫ్టులు, 4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యం ఏర్పాటు చేశారు.