Varsha Bollamma Gallery: పక్కింటమ్మాయిలా మనలో కలిసిపోయే ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ
ముసిముసి నవ్వులతో మెస్మరైజ్ చేస్తుంటుంది వర్ష బొల్లమ్మ. జాను, విజిల్, మిడిల్క్లాస్ మెలోడీస్, స్వాతిముత్యం సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది వర్ష. సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన వర్ష బొల్లమ్మ.. డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యారు.

కర్నాటకలోని కూర్గ్ లో జన్మించిన వర్ష బొల్లమ్మ.

బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ నుంచి మైక్రోబయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందిన వర్ష బొల్లమ్మ

2015లో సినీరంగంలోకి అడుగు బెట్టిన వర్ష బొల్లమ్మ. తమిళంలో ఆమె తొలిసారి నటించింది. ఆమె తొలి సినిమా సతురన్.

2018లో కల్యాణం సినిమా ద్వారా ఆమె మలయాళ సినీరంగంలోకి అడుగు పెట్టారు.

డబ్ స్మాష్ వీడియోల ద్వారా వర్ష బొల్లమ్మ పాపులర్ అయ్యారు. రాజారాణి సినిమాలోని నజ్రియా నజీం డైలాగ్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

96, బిగిల్ సినిమాల్లో చిన్న క్యారక్టర్స్ చేశారు వర్ష బొల్లమ్మ. అవి ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

96లో చేసిన క్యారెక్టరే తెలుగు జానులో కూడా చేశారు వర్ష బొల్లమ్మ. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

చూసీచూడంగానే సినిమా ద్వారా వర్ష తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ తెలుగులో మంచి విజయం నమోదు చేసింది. దీంతో వర్ష బొల్లమ్మ పాపులర్ అయింది.

చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక వర్ష బొల్లమ్మకు ఉండేది. అలా సినిమాలు చూస్తూ పెరిగింది. చివరకు యాక్ట్రెస్ అయ్యింది.

వర్షను ఇంజినీర్ గా చూడాలనేది వాళ్ల అమ్మ కోరిక. కానీ తాను ఇంజినీర్ కంటే యాక్ట్రెస్ గా బాగా రాణిస్తానని వాళ్ల అమ్మను కన్విన్స్ చేసుకుంది వర్ష బొల్లమ్మ.

ఆత్మహత్యల నివారణకోసం పనిచేసే ఆసరా సంస్థతో కలిసి వర్ష బొల్లమ్మ పనిచేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎక్స్ పోజింగ్కు దూరంగా ఉంటుంది వర్ష బొల్లమ్మ. అందుకే అందరూ పక్కంటమ్మాయిలా భావిస్తారు.