US Open Grand Slam Title :19 ఏళ్లకే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం..
అమెరికాకు చెందిన టీనేజి అమ్మాయి కోకోగాఫ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకొని సంచలనం సృష్టించింది. 19 ఏళ్లకే తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

యూఎస్ ఓపెన్స్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

19 ఏళ్లకే తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం

రెండో సెట్లో పుంజుకున్న కోకో అద్భుతమైన షాట్స్‌తో సబలెంకాను ఇబ్బందిపెట్టింది.

రెండో సీడ్ అరీనా సబలెంకా చేతిలో ఆరో సీడ్ అయిన కోకో 2-6 తేడాతో ఫస్ట్ సెట్ కోల్పోయింది.

దీంతో రెండో సెట్ 6-3తేడాతో గెలుచుకుంది.

మూడో సెట్లోనూ విజృంభించి 6-2తేడాతో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది.

2022లో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన కోకో గాఫ్ ఈసారి మాత్రం ఛాంపియన్‌గా రికార్డు

అతి తక్కువ వయసులో యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన అమెరికన్ ఆటగాళ్లలో ట్రాసీ ఆస్టిన్, సెరెనా సరసన చేరింది.

ఆదివారం జరుగనున్న పురుషుల ఫైనల్ మ్యాచ్‌లో మెద్వెదెవ్‌తో రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ తలపడనున్నాడు.

1999లో సెరెనా విలియమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి అమెరికన్ టీనేజర్‌గా కోకో గాఫ్ చరిత్ర తిరగరాసింది.