China : చైనాలో కొత్త వైరస్.. వందలాదిగా పిల్లలు అనారోగ్యపాలు.. పిల్లలతో నిండి పోతున్న చైనా ఆసుపత్రిలు..
చైనాను వణికిస్తున్న మరో వైరస్.. వందలాదిగా పిల్లలు అనారోగ్యపాలు.. పిల్లలతో నిండి పోతున్న చైనా ఆసుపత్రిలు..

చైనా నుంచి వ్యాపించిన ఈ మహమ్మారి కరోన ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.

ఇప్పుడు అదే చైనా నుంచి మరో వ్యాధి వ్యాపిస్తుండటం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది.

ఈ క్రమంలోనే డ్రాగన్ దేశం కలవరపడుతోంది. న్యుమోనియా లక్షణాలతో అక్కడి చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బుధవారం ఉదయం చిన్నారుల ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రోమెడ్ సంస్థ అప్రమత్తం చేసింది.

దీనివల్ల ముఖ్యంగా చిన్నారుల్లో రెస్పిరేటరీ సమస్యలు చాలా వస్తున్నాయి.

రోజు రోజుకూ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో ఈ విషయంపై స్పందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను కోరింది.

అయితే ఇది ఏమాత్రం ప్రమాదకారి.. కాదని చెప్తోంది చైనా దేశం.

ముఖ్యంగా చిన్నారుల్లోనే ఈ న్యుమోనియా వ్యాప్తి అధికంగా ఉందని.. ఆ కారణంగానే ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఇచ్చినట్టు చెప్పింది.

ఉత్తర చైనాలో న్యుమోనియా లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరడంపై WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలివ్వాలని చైనాను కోరింది.

ఏకకాలంలో వందలాదిగా పిల్లలు అనారోగ్యానికి గురికావడం మాములు విషయం కాదని ఆ సంస్థ తెలిపింది.

అసలు ఈ జబ్బు ఎలా పుట్టుకొచ్చిందో అర్థం కాకపోయినా, పాఠశాలలోనే వ్యాప్తి చెంది ఉండొచ్చని వైద్య నిపుణులు, సంస్థలు అనుమానిస్తున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో చైనా కరోనా నిబంధనలను ఎత్తివేసిందని, అప్పటి నుంచి తరచూ అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ప్రోమెడ్ ప్రతినిధులు అన్నారు.

చైనాలో ఈ న్యుమోనియా వ్యాప్తితో భారత్ అప్రమత్తమైంది.

చైనాలో ఉన్న పరిస్థితులను, చిన్నారులపై వ్యాధి ప్రభావాన్ని భారత ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది.

వైరస్ వ్యాప్తిపై చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ విచారణ

ప్రస్తుతానికి చైనా వెళ్లేవాళ్లకు ఎలాంటి గైడ్లైన్స్ పెట్టడంలేదని.. వ్యాధి తీవ్రతను బట్టి త్వరలో ఆలోచిస్తామని తెలిపింది.