Home » Photo-gallery » Ap Cm Jagan Mohan Reddy Is Going To Unveil The Biggest Statue Of Abendkar In Andhra Pradesh Today
Dialtelugu Desk
Posted on: January 19, 2024 | 01:41 PM ⚊ Last Updated on: Jan 19, 2024 | 1:41 PM
ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (జనవరి 19న) విజయవాడలో 206 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ విగ్రహాన్ని చారిత్రక స్వరాజ్ మైదాన్‌లో ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలు హాజరు కావాలని ముఖ్యమంత్రి ఉద్వేగభరితంగా విజ్ఞప్తి చేశారు.
125 అడుగుల విగ్రహం స్టీల్ ఫ్రేమింగ్, కాంస్య క్లాడింగ్‌తో తయారు చేయబడింది.
18.81 ఎకరాల భూమిలో 404.35 కోట్ల రూపాయల వ్యయంతో విగ్రహం, దాని పరిసరాలను నిర్మించారు.
అంబేద్కర్ స్మృతి వనం వద్ద 81 అడుగుల పీఠంపై 125 అడుగుల ఎత్తైన శిల్పాన్ని ఏర్పాటు చేశారు.
ఇక సెకండ్ ఫ్లోర్ లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్ లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది.
గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు హాల్స్ ఉంటాయి. అందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఉంటాయి.
ఇందులో ఆయన జీవత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేశారు.
ఈ నిర్మాణంలో 166 స్తంభాలతో కూడిన కొలనేడ్, అంబేద్కర్ జీవితానికి సంబంధించిన కళాకృతులతో కూడిన కుడ్యచిత్రాలు ఉన్నాయి.
ప్రాజెక్ట్ డిసెంబర్ 21, 2021న ప్రారంభమైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14, 2023న ప్రారంభించాలని మొదట ప్రణాళిక చేయబడింది.
ఇది ప్రపంచంలోనే అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే అతి పెద్ద మ్యూజియం కావడం విశేశం.
ఇది రెండు అంతస్తుల ట్రాపీజియం ఆకారంలో RCC-ఫ్రేమ్‌తో కూడిన నిర్మాణం.
బౌద్ధ వాస్తుశిల్పంలో కాలచక్ర మండలాన్ని పోలి ఉండేలా పీఠం నిర్మించారు.
పీఠం భవనం మాత్రమే 11,140 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, 1445 మెట్రిక్ టన్నుల టీఎంటీతో తయారు చేయబడింది. పింక్ ఇసుకరాయితో కప్పబడి ఉంటుంది.
ముందుబాగం కారిడార్ ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పతో రూపొందించారు.
విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో దీనిని నిర్మించారు, దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్గా నామకరణం చేస్తున్నారు.
స్మారక చిహ్నం ముందుభాగంలో ఆరు వాటర్‌బాడీలు, మధ్యలో ఒక సంగీత నీటి ఫౌంటెన్‌ను ఉంది
దాదాపు 500-600 మంది కార్మికులు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ 55 మంది సాంకేతిక, సహాయక సిబ్బందితో ఈ ప్రాజెక్ట్‌లో పనిచేశారు.
విగ్రహం చుట్టూ ఉన్న ప్రదేశంలో 'డాక్టర్ BR అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్', 2000 మంది సీటింగ్ కెపాసిటీ కలిగిన కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, పిల్లల ఆట స్థలం, వాటర్ బాడీలు, మ్యూజికల్ ఫౌంటెన్, నడక మార్గాలు ఉన్నాయి.