World Press: వరల్డ్ ప్రెస్ బెస్ట్ ఫోటో కాంటెస్ట్ లో అవార్డులు సాధించిన చిత్రాలు ఇవే..
వరల్డ్ ప్రెస్ బెస్ట్ ఫోటో కాంటెస్ట్‌లో నిలిచిన అద్భుతమైన ఫోటోలు..

అసోసియేటెడ్ ఫొటోగ్రాఫర్ ఎవ్గెన్లీ మలోటెకా తీసిని చిత్రం. ఉక్రెయిన్ రష్యా దాడిలో ఓ మహిళ ప్రసూతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సమయంలో తప్పని సరి పరిస్థితిలో ఇలా స్ట్రక్ఛర్ పై తీసుకెళ్లారు.

అఫ్గనిస్థాన్ లో తీవ్ర సంక్షోభం నెలకొన్న తరుణంలో ఖలీల్ అహ్మద్ తల్లిదండ్రులు పూట గడవడం కోసం తమ కుమారుని కిడ్నీలను అమ్ముకోవల్సి వచ్చింది. ఫొటోగ్రాఫర్ ఫొలిటికెన్ ఈ చిత్రాన్ని తన కెమెరా సహాయంతో బంధించారు

అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ చెక్‌పాయింట్ వద్ద గస్తీ కాస్తున్న చిత్రాన్ని ఫొటోగ్రాఫర్ మాడ్స్ నిస్సన్ తన కెమెరా కళ్లలో బంధించాడు

అఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌లో కొందరు మహిళలు, చిన్నారులు బ్రెడ్ ఇవ్వమని బేకరీ ఎదుట యాచిస్తున్న చిత్రాన్ని ఫొటోగ్రాఫర్ మాడ్స్ నిస్సన్ తీశారు.

కాబూల్‌లో గతంలో ఉన్న యూఎస్ ఎంబసీ మీద ‘అల్లా తప్ప మరే దేవుడు లేడు’ అని రాసి ఉంచిన దృశ్యాన్ని మాడ్స్ నిస్సన్ చూపించారు.

తజికిస్థాన్‌లోని వఖ్ష్ నది తీరంలో నిర్మించుకున్న ఇసికూల్ గ్రామ నివాసి. ఈ ఫోటో వరల్డ్ ప్రెస్ ఫొటో లాంగ్ టర్మ్ ప్రాజెక్టు అవార్డును గెలుచుకుంది. ఈ మానవీయ ఘటనను అనుష్ బాబాజన్యాన్ తన కెమెరాలో బంధించారు.

ఉజ్బెకిస్థాన్‌లోని నదిలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. ఈ కరువు దృశ్యాన్ని అనుష్ బాబాజన్యాన్ చిత్రీకరించారు.

హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కోసం నిర్మిస్తున్న 335 మీటర్ల ఎత్తైన రోగన్ డ్యామ్.

కజకిస్థాన్‌లోని అకేస్పే గ్రామంలో ఉన్న అరల్ సముద్రం నుంచి ఉద్భవించిన వేడి నీటి బుగ్గను ఆస్వాదిస్తున్న మహిళలు

ఉక్రెయిన్‌లోని మేరియుపొల్‌లో కదులుతున్న రష్యన్ యుద్ధ ట్యాంకులను ఫొటోగ్రాఫర్ ఎవిగ్నీ మాలలోలెట్కా చిత్రీకరించారు.

ఉక్రెయిన్ ఆర్మీ వైద్య సిబ్బంది ఆంటన్ గ్లాడన్. రష్యా యుద్దంలో తన రెండు కాళ్లు పోగొొట్టుకున్న చిత్రం. ఈ ఫోటోను ఎమిలో మోరెనట్టి అనే ఫోటోగ్రాఫర్ తీశారు.

మేరియుపొల్‌లోని బాంబ్ షెల్టర్‌లో బిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో బ్రతుకుతున్న జనం. ఎవిగ్నీ మాలలోలెట్కా వీరిని ఫోటో రూపంలో తీసి ప్రపంచానికి పరిచయం చేశారు.