Amardeep-Supreeta new movie : బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్-సుప్రీతల కొత్త సినిమా ప్రారంభం..
బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత కలిసి నటిస్తున్న సినిమా ప్రారంభమైంది. మహర్షి కూండ్ల సమర్పణలో ఎం3 మీడియా బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి ప్రొడక్షన్ నెం 2గా మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.

బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత కలిసి నటిస్తున్న సినిమా ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్ కొట్టగా.. ఏఎం రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.

పూజా కార్యక్రమాలతో అమర్ దీప్, సుప్రీత మూవీ లాంఛనంగా ప్రారంభమైన తర్వాత మూవీ టీమ్ మీడియాతో మాట్లాడింది.

ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. ‘ఎం3 బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం. 2 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము.

ఈ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రంలో అమర్ దీప్ చౌదరి, సుప్రితలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక దర్శకుడు మాల్యాద్రి రెడ్డి మాట్లాడుతూ.. ‘మా లాంటి కొత్త వాళ్ళని ఎం3 మీడియా ఎంతో ప్రోత్సహించింది.

ఇంకా మాలాంటి కొత్త వాళ్ళని, యంగ్ టాలెంట్ ఉన్న వాళ్లని ఎంకరేజ్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నాడు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల తెలిపారు.

హీరోయిన్ సుప్రీత మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అమర్ దీప్ తో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.


మూవీ హీరో, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒప్పుకున్న సినిమా అయితే కాదు. ‘బిగ్ బాస్ కంటే ముందే ఈ చిత్రానికి సైన్ చేశాను.




హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.

మహర్షి కూండ్ల సమర్పణలో ఎం3 మీడియా బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి ప్రొడక్షన్ నెం 2గా మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.