Janhvi Kapoor Gallery : శ్రీదేవిని గుర్తు చేస్తున్న అందాల భామ జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ 1997 మార్చి 6న జన్మించారు

శ్రీదేవి, బోనీ కపూర్ ఆమె తల్లిదండ్రులు

2018లో ధడక్ సినిమా ద్వారా జాన్వీ సినీ రంగప్రవేశం చేశారు

జాన్వీ విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది

కాలిఫోర్నియాలోని యాక్టింగ్ స్కూల్లో ఆమె నటనలో శిక్షణ పొందారు

ఇప్పటివరకూ జాన్వీ కపూర్ 6 సినిమాల్లో నటించారు

ప్రస్తుతం బవాల్, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమాల్లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు

జాన్వీ నటించిన గుంజన్ సక్సేనా-ది కార్గిల్ గర్ల్ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది

సినీ వారసత్వం నుంచి వచ్చినా జాన్వీ కపూర్ తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు

తనను నెపో కిడ్ అనడంపై జాన్వీ కపూర్ ఎంతో ఆవేదన చెందుతుంటారు

వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు ఎంతో బాధ కలుగుతుందంటారు జాన్వీ కపూర్

తల్లి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేయాల్సిన భారం తనపైన ఉందని జాన్వీ కపూర్ చెప్తుంటారు

సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది

జాన్వీ కపూర్ చెల్లెలి పేరు ఖుషి

త్వరలోనే జాన్వీ కపూర్ తెలుగు సినిమాలో నటించబోతోందని సమాచారం

ఇంతకాలం బాలీవుడ్ కే పరిమితమైన జాన్వీ కపూర్ ఇకపై సౌత్ పైన కూడా ఫోకస్ పెడుతోంది

బాలీవుడ్ లో జాన్వీ కపూర్ తనకంటూ ఒక ప్రత్యేక సెలబ్రిటీ హోదా తెచ్చుకున్నారు

అవకాశాలు వచ్చేందుకు తన కుటుంబం హెల్ప్ చేసినా నటన ద్వారానే తనకు పేరొస్తుందంటారు జాన్వీ కపూర్

నటనలో ఇప్పుడు మెరుగుపడ్డానని, తనకు కూడా మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నట్టు జాన్వీ కపూర్ చెప్తారు

తనకు నటన రాదని గేలి చేస్తున్నవాళ్లకు తన నటనతోనే సమాధానం చెప్తానంటారు జాన్వీ కపూర్

చేసింది తక్కువ సినిమాలే అయినా నటనలో ఎంతో పరిణతి సాధించారు జాన్వీ