Chevi Reddy Bhaskar Reddy: టీటీడీ ఛైర్మన్ చేతుల మీదుగా చంద్రగిరి ప్రీమియర్ లీగ్..
వైఎస్ఆర్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా చంద్రగిరి ప్రీమియర్ లీగ్ ను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరై రిబ్బన్ కటింగ్ చేసి మ్యాచ్ ను ప్రారంభించారు. యువనాయకులు చెవిరెడ్డి మొహిత్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం కనబరిచారు.

చంద్రగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. దీనికి సంబందించిన కప్పులు, మెడల్స్ కి సంబంధించిన గ్యాలరీ ఏర్పాటు చేశారు

ఈ కార్యక్రమానికి చాలా మంది చుట్టుపక్కల గ్రామాల వారు హాజరయ్యారు

టిటిడి ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి రిబ్బన్ కట్ చేశారు

ఈ లీగ్ కి సంబంధించిన వేదికపై నుంచి మాట్లాడుతున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ యువతలో చైతన్యం నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు

చంద్రగిరి ప్రీమియర్ లీగ్ కు సంబంధించిన మొమెంటో షీల్డ్ ను సభా ముఖంగా ప్రదర్శించారు

మైదానం మొత్తం రంగు రంగుల జెండాలతో అలంకరించారు

రిబ్బన్ కటింగ్ అనంతరం జ్యోతి వెలిగించి దైవారాధన చేశారు వైవి సుబ్బారెడ్డి

ఎలాంటి విఘ్నాలు లేకుండా లీగ్ విజయవంతం అవ్వాలని భగవంతునికి హారతి ఇస్తున్న చంద్రగిర ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

చంద్రగిరి ప్రీమియర్ లీగ్ కప్ గ్యాలరీ

క్రికెట్ ఆడేందుకు పెద్ద ఎత్తున హాజరైన యువకులు

యువనాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బ్యాటింగ్ చేస్తున్న చిత్రం

టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి బ్యాటింగ్ ఆడుతున్న దృశ్యం

గ్యాలరీలో భద్రపరిచిన కప్పులను సుబ్బారెడ్డికి ప్రదర్శిస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే

ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష స్పందన లభించింది.