Children Care: వేసవి బారిన పడకుండా పిల్లలను కాపాడుకునే టిప్స్
భారత్ పై భగభగ మంటున్నాడు భానుడు. భూమిపై తన ప్రభావం చూపుతున్నాడు సూర్యుడు.

భగభగ మండే వేసవికాలం వచ్చేసింది.

పిల్లల కోసం తల్లిదండ్రులకు ఈ క్రింది ముఖ్య సూచనలు పాటించండి.

6 ఏళ్ళ వయస్సు చిన్నారును చల్లని వాతావరణంలో ఉండేలా చూడండి. కొద్దిగా శరీరం వేడెక్కినా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

తప్పనిసరి అయితే తప్ప బయటకు తీసుకెళ్లకండి. వెళ్లాల్సి వస్తే సన్ స్క్రీన్ లోషన్స్ చర్మంపై రాయండి.

పండ్లరసాలు, కొబ్బెరినీళ్లు తాగడం శ్రేయస్కరం. రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తీసుకోవడం ఉత్తమం.

శరీరంపై వదులుగా పల్చగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.

రోజూవారి తీసుకునే ఆహారంలో ఉప్పు, నీరు, లవణాలు, పోషకవిలువలు ఉండేలా చూసుకోవాలి.

చిన్న పిల్లలకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి.

ఇంటి ఆహారం తినేందుకు ఎక్కువ ప్రయత్నించాలి. బయటి ఆహారాల జోలికి వెళ్లడం మంచిది కాదు.

పిల్లలు తిరిగే ప్రదేశాలు తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలి. లేకుంటే క్రిములు ధరిచేరి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది.