Karnataka Elections: కర్ణాటక కాంగ్రెస్ విజయం.. దేశవ్యాప్తంగా సంబరం..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని తమ విజయంగా దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో కార్యకర్తలు సంబరాలు జరిపారు. రంగులు పూసుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ, టపాసులు కాలుస్తూ ఆనందంగా గడిపారు. కర్ణాటక విజయం కాంగ్రెస్ లోని ప్రతి శ్రేణుల్లో, కార్యకర్తల్లో జోష్ ను నింపింది.

ఏపీలో పార్టీ ఆఫీసు బయట రాహూల్ ఫ్లెక్సీలను ప్రదర్శిచిన నాయకులు

బాణాసంచా కాల్చుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు

రంగులు, డ్రమ్స్, పార్టీ జెండాలతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ప్రాంగణాలా అన్నీ కోలాహలంగా మారిపోయింది

ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ విజయాన్ని స్వీట్లు తినిపించుకుంటూ జరుపుకున్నారు

బజరంగ బలి గదను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ యువ నాయకుడు

హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తల సంబరాలు.

కాంగ్రెస్ గెలుపు ముస్లీంలలో పట్టరాని ఆనందం కనిపించింది.

కర్ణాటకలోని బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట హంగామా

కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చినట్లు భావిస్తున్న కార్యకర్తలు, పార్టీ శ్రేణులు

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కర్నాటక విజయాన్ని తమ విజయంగా జరుపుకున్నారు.

చిందులేస్తున్న యువత

కార్యకర్తల్లో జోష్ మరింత పెరిగింది

శ్రీనగర్ లోనూ కాంగ్రెస్ విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు

హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి