Cyclone: బీభత్సం సృష్టిస్తున్న బిపర్ జోయ్ చిత్రాలు.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ..
బిపర్ జోయ్ తుఫాన్ దాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. దాదాపు కొన్ని వందల మీటర్లమేర సముద్రం ముందుకు చొచ్చుకొని వచ్చింది. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గుజరాత్ లో తుఫాన్ ప్రభావిత ప్రాంతంలోని పరిస్థితిని ప్రధాని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను ఏర్పాటు చేశారు.

బిపర్ జోయ్ తుఫాన్ లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు సిద్దంగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు

తీర ప్రాంతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని సూచించడంతో ఇంట్లో ఉండే అవసరమైన సామాగ్రిని తీసుకొని రోడ్డుపై కూర్చున్న పేద కుటుంబాలు

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సహాయక చర్యలు చేపట్టాలని దిశా నిర్ధేశం చేస్తున్న అధికారులు

జాలర్లు వలలను భుజాన వేసుకొని వెనుదిరుగుతున్న వైనం

సాగర తీరంలో ఎవరూ ఉండకూడదని హెచ్చరికలు జారీ చేస్తూ పెట్రోలింగ్ చేపడుతున్న పోలీసులు

అలల ఉధృతి భారీగా ఉండటంతో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు

లోతట్టు ప్రాంతాల వారిని లారీలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు

సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి ముందస్తుగా అక్కడి వారిని ఖాళీ చేయిస్తున్న చిత్రం

బోట్లు, పడవల్లో వెళ్లే వారు ఒడ్డుకే పరిమితం అయ్యారు

ఎవరూ సముద్రం దగ్గరకి రాకుండా పోలీసు కానిస్టేబుల్ ను ఏర్పాటు చేశారు

తీర ప్రాంతాల వారి ఇండ్లపైకి ఎగసిపడుతున్న సముద్ర అలలు

గుజరాత్, మహారాష్ట్రలో పరిస్థితి చాలా ప్రమాదస్థాయిలో ఉంది

తుఫాన్ ధాటికి ముందుకు చొచ్చుకు వచ్చిన సముద్రం

ఎటు చూసినా పోటెత్తిన అలలే

ఎరుపు రంగు జండాలతో ప్రమాద హెచ్చరికలు జారీ