Tollywood Fresh combination : రండి బాబు రండి.. కొత్త కొత్త జంటలతో ఈ సంక్రాంతికి మాస్ హీరోలతో ఫ్రెష్ కాంబినేషన్..
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరు కూడా తొలిసారిగా.. కొత్తగా.. జంటగా.. కలిసి నటించిన సినిమాలే.

మహేష్ -మీనాక్షి చౌదరి.. ఇదే గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మీనాక్షి తో ఫ్రెష్ కాంబినేషన్ పెట్టారు.

నాగార్జున - ఆషికా రంగనాథ్.. ఇదే సంక్రాంతికి మరో పెద్ద సినిమా విడుదల కాబోతుంది. అదే మన కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ. ఈ సినిమాలో కింగ్ కి జోడీగా కన్నడ బామ్మ ఆషికా నటించింది. కాగా ఇదివరకే విడుదలైన 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే.. 'పాటలో ఈ మన్మథుడితో కన్నడ ముద్దుగుమ్మ స్టెప్పులు, రొమాంటిక్ లుక్స్ అందరినీ ఆకర్షించాయి.

విక్టరీ వెంకటేష్ - శ్రద్ధా శ్రీనాథ్.. సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్న సైంధవ్ లో కూడా విక్టరీ వెంకటేష్ కు జోడీగా ఓ కొత్త నటి శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.

రవితేజ - కావ్యా థాపర్ ( ఏక్ మినీ కథ ).. రవితేజ సినిమా విడుదల కోసం ఈగల్ గా వేట్ చేస్తున్న మాస్ మహారాజా ఫ్యాన్స్ కు ఈ సినిమ హీరోయిన్ పిచ్చెకించేదోదటా.. ఎందుకు అంటారా..? ఈగల్ సినిమాలో కూడా కొత్త కావ్య థాపర్ రవితేజ సరసన నటిస్తుంది.

యంగ్ హీరో తేజ సజ్జ - యంగ్ అమృత అయ్యర్ ( 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ).. ఎవ్వరూ ఎమనుకున్న సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు సైతం పోటీ ఇస్తూ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమా హనుమాన్. ఈ సినిమాలో కూడా యంగ్ హీరో తేజ సజ్జ జోడీగా బెంగళూరు బ్యూటీ అమృత్ అయ్యర్ నటించింది. ఇదివరకే యాంకర్ ప్రదీప్ తో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ యూత్ మనసులు కొల్ల గోట్టిన అయ్యర్ ఇప్పుడు తన మూడో సినిమా అయినా హనుమాన్ లో నటిస్తుంది.

విజయ్ సేతుపతి - కత్రినా కైఫ్.. ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళ డబ్బింగ్ సినిమాల్లో ఇదే ఫ్రెష్ కాంబినేషన్లు.. తమిళ సినిమా అయినా మేరీ క్రిస్మస్ చిత్రం ఇదే సంక్రాంతికి విడుదల అవుతోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ విలన్, హీరో, విజయ్ సేతుపతి.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా మేరి క్రిస్మస్ సినిమా విడుదల అవుతోంది.

ధనుష్ - ప్రియాంకా అరుల్ మోహన్.. ఇక భారీ అంచనాలతో విడుదలై అవుతున్న మరో కోలీవుడ్ చిత్రం కెప్టెన్ మిల్లర్ కూడా సంక్రాంతి బరిలో విడుదల అవుతున్నాయి. ఇందులో ధనుష్ కు జోడీగా.. డాక్టర్, DON, మూవీ ఫేమ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు.

శివకార్తికేయన్ - రకుల్.. తెలుగులో తనదైన ముద్ర వేసిన, సిమారాజా, డాక్టర్, DON,ప్రిన్స్ మూవీ హీరో శివ కార్తికేయన్ నటించిన చిత్రం అయలాన్. ఇందులో కార్తికేయన్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

మహేష్- శ్రీలీల.. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో భారీ క్రేజ్ ఉన్న సినిమా ఏది అంటే అది నోట.. ఒకటే మాట.. గుంటూరు కారం. మహేష్ బాబు, త్రివిక్రమ్ హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ఒక కాన్సెప్ట్ తో ఎప్పుడు చేయ్యని కొత్త కొత్త జంటలను కలిపి మాటల మంత్రికుడు గుంటూరు కారం సినిమా చేశారు. ఇది సంక్రాంతి కానుకగా.. 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. దీంతో మహేష్ కు జంటగా శ్రీలీల నటించింది. ఇప్పటికే "కుర్చీ మడత పెట్టి" పాట మహేష్, శ్రీ లీల వేసిన స్టెప్పులకు రెస్పాన్స్ అదిరిపోయింది.