Women’s IPL : జయహో RCB ఢిల్లీ ని ఓడించి.. తగ్గేదే లేదంటూ టైటిల్ కైవసం..
గత 16 ఏళ్లగా ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ కలను డబ్ల్యూపీఎల్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల తీరింది. పురుషుల ఐపీఎల్లో సుధీర్ఘ కాలంగా నిరీక్షణ కొనసాగుతుండగా... మహిళల ఐపీఎల్లో కప్ గెలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి తొలిసాగి ఛాంపియన్‌గా నిలిచింది.

గత 16 ఏళ్లగా ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ కలను డబ్ల్యూపీఎల్‌లో అమ్మాయిలు నెరవేర్చారు.

మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కైవసం చేసుకుంది.

బెంగళూరు మహిళల జట్టు డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో ఢిల్లీని 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ప్రతిసారి ఐపీఎల్‌కు ముందు ఈ సాలా కప్ నమదే అంటూ ఆర్సీబీ బరిలోకి దిగేది.

ప్రతిసారి ఆర్సీబీ జట్టు ఆశలు ఆవిరవుతుండేవి. కానీ ఆర్సీబీ మహిళలు ట్రోఫీ సొంతం చేసుకుని ఎన్నో కలను దక్కించుకున్నారు.

ఎంతో మంది క్రికెటర్లు ఆర్సీబీ తరపున ఆడారు.

కానీ ఒక్కసారి కూడా జట్టు టైటిల్ గెలవలేకపోయింది. ఈ సీజన్లో ఎన్నో ఒడుదుడుకులతో ఆర్సీబీ ముందుకు సాగింది.

సవాళ్లు దాటి ఫైనల్ చేరిన మొదటిసారే ఛాంపియన్‌గా నిలిచారు.

ఈ పోరులో ఢిల్లీ ఒపెనర్లు మొదట బాగానే ఆడిన బౌలింగ్‌లో ఆర్సీబీని ఎదుర్కొలేకపోయింది. ఫైనల్లో నాలుగు వికెట్లు సహా సీజన్లో నిలకడగా రాణించిన శ్రేయాంక పాటిల్(13) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది.

ఆశ (12), సోఫీ మోలనూ(12) కూడా బౌలింగ్‌లో సత్తా చాటారు.

అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన ఎలీస్ పెర్రీ(347), బౌలింగ్‌లోనూ 7 వికెట్లతో ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేసింది.

కెప్టెన్‌గా జట్టును సమర్థంగా నడిపించిన స్మృతి మంధాన(300) బ్యాటింగ్‌లోనూ రాణించింది.

అదే విధంగా ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచింది.

ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచింది.

దీంతో ఆమెకు రూ.5 లక్షల ప్రైజ్ మనీ లభించింది.

అదే విధంగా ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచింది.

ఇందులో ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ దీప్తి శర్మ, ఎమర్జింగ్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ దీప్తి శర్మ, బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ సజన సజీవన్, ఫెయిల్ ప్లే టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకున్నాయి.





















డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీకి రూ.6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.





రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కల చివరకు నేరవేరింది.