Gangamma Jaatara: అంగరంగ వైభంగా తిరుపతి గంగమ్మ జాతర.. వింతైన అలంకారాల్లో పాల్గొన్న భక్తులు..
తిరుపతి తాతాయ్య గుంట గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు తమ మొక్కు చెల్లించుకోవడం కోసం వివిధ రకాలా వేషధారణలు ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్, భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నారు.

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు తరలి వచ్చిన భక్తులు

ఆకర్షణీయమైన వేషధారణలో అలరించారు

అమ్మాయిలు నృత్యం చేస్తూ అమ్మవారికి భక్తితో తమ మొక్కును చెల్లించుకున్నారు

అబ్బాయిలు అమ్మవారి పాటలకు గ్రూప్ డ్యాన్స్ వేశారు

కాళీమాతా వేషధారణ వేసుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కేరళా వాద్యకారులు వింతైన గెటప్ ధరించి డ్రమ్స్ వాయించారు.

ఉగ్రరూపంలో కనిపించే కాళీ మాత వేషం

చిన్న పిల్లలు సుబ్రహ్మణ్య స్వామి వేషాన్ని ధరించారు.

ప్రతి వేసవికాలంలో వైశాఖమాసాన ఈ ఉత్సవాన్ని చిన్న పెద్ద అందరూ ఆనందంగా జరుపుకుంటారు.

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకోసం అమ్మవారికి సమర్పించిన వస్త్రాది పూజా ద్రవ్యాలు

విచిత్ర వేషాలు ధరించిన వారితో సెల్ఫీలు దిగేందుకు కొందరు మహిళలు ఉత్సాహం చూపించారు.

అమ్మవారి దర్శనానికి ఆలయంలోపల క్యూలలో వేచి ఉన్న భక్తులు

ఈ వేడుకలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటూ.. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

నల్లని మసి పూసుకొని భయంకరమైన రూపంలో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పిల్లలు