Hyderabad Rain: భాగ్యనగరానికి ఏమైంది..? ఒకవైపు జోరువాన.. మరోవైపు హోరుగాలి..!
గత రెండు రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో పనికి వెళ్లి వచ్చేవారికి తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. భీకరమైన గాలికి విద్యుత్ తీగలు షాట్ సర్క్యూట్ జరిగి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం కలిగింది. రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ ఏర్పడింది. పంజగుట్ట, అమీర్ పేట్, అంబర్ పేట్, ఎల్బీనగర్, హిమాయత్ నగర్, నారాయణగూడ, కాచిగూడ, ఖైరతాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం ప్రభావానికి డ్రైనేజి పొంగి రోడ్లపైకి మురుగు నీరు వచ్చి చేరుకుంది.
1 / 12 

హైదరాబాద్ లో వడగళ్ల వర్షం
2 / 12 

హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం టెంట్లు తడిచిపోయాయి
3 / 12 

సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముంచెత్తిన వర్షం
4 / 12 

ఆటో వెనుక నిలుచొని పైట కొంగును కప్పుకొని ప్రయాణం సాగిస్తున్న కూలీలు
5 / 12 

ఎల్ బీ నగర్ ప్రాంతాల్లో వర్షం ధాటికి బైకు వేగం పెంచిన యువకుడు
6 / 12 

తడిసి ముద్దైన మహిళలు
7 / 12 

ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారిపోయాయి
8 / 12 

నారాయణగూడ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో గల్లీలు ఇలా దర్శనమిచ్చాయి
9 / 12 

సాహసం చేయరా ఢింబకా అనేలా ఉంది పరిస్థితి.
10 / 12 

చిన్న చెరువును తలపిస్తున్న పురవీధులు
11 / 12 

బైకు పై గొడుగుతో ప్రయాణం సాగిస్తున్న మధ్యతరగతి నగరవాసులు
12 / 12 

గంటన్నర పాటూ దంచికొట్టిన వర్షం