Chindu Yakshagana, Gaddam Samaiah : చిందు యక్షగాన కళాకారుడు పద్మశ్రీ గడ్డం సమయ్య జీవిత విశేషాలు – ఫోటోలు
చిందు యక్షగాన కళాకారుడు పద్మశ్రీ గడ్డం సమయ్య జీవిత విశేషాలు

సమ్మయ్య జన్మస్థలం తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామం

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఉమ్మడి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.

రామస్వామి, ఛండికాంబ దంపతులకు 1958, జనవరి 5న సమ్మయ్య జన్మించాడు.

సమ్మయ్యకు 1983లో శ్రీరంజనితో వివాహమైంది.

పద్నాలుగేళ్ల ప్రాయంలో ‘చిన్నికృష్ణుడి’గా కళారంగంలోకి అడుగుపెట్టి.. ‘కీచక’ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆయనకు అక్క, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెల్లు. సంచార జీవితం గడుపుతూ సమ్మయ్య కుటుంబం అప్పిరెడ్డిపల్లిలో స్థిరపడింది. గ్రామంలోనే సమ్మయ్య ఆరో తరగతి వరకు చదువుకున్నాడు.

ఆయన కళారంగానికి గత ప్రభుత్వం రాష్ట్రియ పుర్కారంతో సంత్కరించింది.

ఆ తర్వతా ‘రంగస్థలం’పై లోహితాన్యుడు, సిరియాళుడు, బాలవద్ధి, సత్యహరిశ్చంద్రుడు, కంసుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణుడి వేషధారణలతో ప్రేక్షకులను అలరించారు.

ఈవే కాకుండా సామాజిక కార్యక్రమాలు, అవగాహన అంశాలపై వేలాది ప్రదర్శనలతో ప్రజలను మెప్పించిన గడ్డం సమ్మయ్యను ‘పద్మశ్రీ’ వరించింది.

1985లో జనగామ పురపాలక సంఘం కార్యాలయంలో ‘కీచకవధ’ ప్రదర్శనలో కీచకుడి పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

1991లో కళాకారుల సంఘాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వం తరఫున అనేక సామాజిక కార్యక్రమాలు, అవగాహన అంశాలపైనా ప్రదర్శనలు ఇచ్చాడు.

తన తండ్రి ప్రోత్సాహంతో చిన్ని కృష్ణుడి వేషధారణతో కళారంగంలోకి అడుగుపెట్టిన సమ్మయ్య,.

1988 లో నెహ్రూ యువకేంద్రం ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తొమ్మిదిమంది బృందంతో రాష్ట్ర, జాతీయస్థాయి వేదికలతో పాటు 1991లో ఆలిండియా రేడియోలో 80 ప్రదర్శనలు, దూరదర్శనిలో 30 ప్రదర్శనలు, యువజన సాంస్కృతిక పర్యాటక శాఖల ఆధ్వర్యంలో వేలాది ప్రదర్శనలు ఇచ్చాడు.

5దశాబ్దాలలో 19వేల ప్రదర్శనలతో అరుదైన గుర్తింపు సాధించాడు. సమ్మ య్య జీవిత విశేషాలతో ‘చిందుల హంస’ అనే పుస్తకం కూడా వెలువడింది.

దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయన కళను గుర్తించి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది.