Fire Accident: మంటల్లో దగ్ధమైన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ బోగీలు.. (ఫోటోలు)
హౌడా నుంచి సికింద్రాబాద్ వరకూ ప్రయాణించే ఫలక్నుమా ఎక్స్ ప్రెస్ లో తీవ్రమైన మంటలు చెలరేగాయి. దాదాపు ఆరు బోగీలకు మంటలు వ్యాపించాయి. ప్రయాణీకులు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న లోకో పైలెట్ రైలును ఉన్నచోటే నిలిపి వేయడంతో ప్రయాణికులు క్రిందకు దిగేశారు. దీంతో ప్రాణనష్టం సంభవిచలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది

మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ షాట్ సర్క్యూట్ కి గురైంది

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో పాటూ స్థానిక పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు

పూర్తిగా కాలి బూడిదైన బోగీలు

అప్రమత్తమైన లోకోపైలట్ రైలును అక్కడికక్కడే నిలిపివేశారు

ముందుగా ఎస్ 4, ఎస్ 5 బోగీల్లో మంటలు చెలరేగాయి

ఈ రెండు బోగీల కారణంగా వాటికి పక్కనున్న బోగీలకు మంటలు వ్యాపించాయి

నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి

ప్రయాణీకులను సికింద్రాబాద్ చేర్చేందుకు ప్రత్యేక బస్సులతో పాటూ లోకమాన్య తిలక్ రైలును ఏర్పాటు చేశారు.

ప్రయాణీకుల లగేజీ మొత్తం మంటల్లో కాలి బూడిదవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

సమయానికి అందరూ అప్రమత్తం అవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు