Afghanistan Earthquake : ప్రకృతి ప్రకోపం.. అఫ్గాన్ లో భారీ భూకంపం.. 2000 మంది మృతి
అఫ్గాన్ లో భారీ భూకంపం.. 2000 మంది మృతి. 2 దశాబ్దాల్లో ఈ స్థాయిలో ఇదే అతి పెద్ద భూకంపం అన్న అధికారులు

అఫ్గాన్ లో రికార్డ్ స్థాయిలో భూకంపం..

అఫ్గానిస్థాన్ లో శనివారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం తీవ్ర విపత్కర పరిస్థితులకు దారితీస్తోంది.

పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా రికార్డ్ స్థాయిలో ప్రాణ నష్టం

ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పొయిన వారి సంఖ్య గణనీయంగా 2000 లకు చేరింది.

భారీ స్థాయిలో భూమి కంపించడం వల్ల వేల ఇళ్లు నేలకూలాయి.

శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి రెస్కూ టీం.

మృతుల సంఖ్య మరింత పెరగే అవకాశం

పశ్చిమ ప్రాంతంలోనే ప్రదానంగా ఏడు సార్లు భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

12 గంటల 11 నిమిషాలకు 6.1 తీవ్రతతో ఒకసారి.. ఆ తర్వాత 12 గంటల 42 నిమిషాలకు 6.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు తెలిపింది.

ఈ పెను ప్రమాదంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు సహాయక బృందాలు తెలిపాయి.

దీంతో ప్రజలు భయాందోళలనతో రోడ్డుపైకి పరుగులు తీశారు.

ఇలాంటి భూకంపం ఇప్పటి వరకూ ఎన్నడూ చూడలేదంటున్నారు బాధితులు.

ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే

రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైన భూకంపమే అతి పెద్దదని పేర్కొంది.

2022లో ఇదే స్థాయిలో భూకంపం సంభవించినట్లు అప్పటి లెక్కలు చెబుతున్నాయి.

2 దశాబ్దాల్లో ఈ స్థాయిలో ఇదే తొలిసారి అన్న అధికారులు

హెరాత్ ప్రావిన్స్‌లో 19 లక్షల మంది నివసిస్తున్నారు.

400 ఇల్లు పూర్తి స్థాయిలో పడిపోగా, 150 ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి.

పూర్తిగా నేలమట్టం అయిన ఇల్లు.

బాధితులను రక్షిస్తున్న స్థానికులు