Fire Accident: అనకాపల్లిలో అగ్నికి ఆహుతి అయిన ఫార్మా కంపెనీ (ఫోటోలు)
అనకాపల్లిలోని అచ్యుతాపురం యూనిట్ 1 లోని ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. కంటైనర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున గగనతలంపైకి ఎగిశాయి. దట్టమైన నల్లని పొగ చుట్టు పక్కల ప్రాంతాలను కమ్మేసింది. ఫైరింజన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏ మేర ఆస్తినష్టం జరిగిందో తెలియాలంటే పరిస్థితి అదుపులోకి రావాలంటున్నారు ఫార్మాసీ యాజమాన్యం. ఈ మంటల్లో చిక్కుకొని ఇప్పటి వరకూ ఇద్దరు మరణించినట్లు తెలుస్తుంది.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది

ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

సాహితీ సెజ్‌లోని ఫార్మాలో భారీ పేలుడు సంభవించింది.

వెంటనే అప్రమత్తమైన అగ్రిమాపక దళం

భారీ శబ్దంతో పేలుడు జరగడంతో భయాందోళనకు గురైన కార్మికులు

ప్రాణ భయంతో పరుగులు తీసిన ఫార్మా సిబ్బంది

ఫార్మా సంస్థలో రియాక్టర్ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు

ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందినట్లు తెలుస్తుంది

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలు

ప్రమాదాన్ని చూసేందుకు స్థానికులు అక్కడికి చేరుకున్నారు

పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ ఆస్తి నష్టాన్నిఅంచనావేయలేమంటున్న యాజమాన్యం

కొన్ని వందల మీటర్ల వరకూ కమ్మేసిన దట్టమైన నల్లని పొగ