Weekend Hyderabad: చిత్రాలు చెప్పే కథలు ఇంతింత కాదయా..!
భాగ్యనగరం వీకెండ్ సిత్రాలు.. అవి చెప్పే ముచ్చట్లు

వేసవి తాపం పెరగడంతో మియాపూర్ లో చల్లనీటిని తాగేందుకు కుండను కొనుగోలు చేస్తున్నారు.

మట్టి కుండలను విక్రయిస్తున్న దుకాణదారులు

మరో వైపు మొక్కలను కొనేందుకు ఉత్సాహం చూపిన నగరవాసులు

ఒకవైపు చల్లదనం, మరోవైపు పచ్చదనం కోరుకుంటున్న హైదరబాదీలు

వీకెండ్ కావడంతో సెక్రెటరీయట్ వద్ద ట్రాఫిక్

తాజాగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన్ ను చూసేందుకు తరలి వచ్చిన జనం

ముదురు అరుణ వర్ణంలో నింగికి ఎగురుతున్న నీటి ధారలు

రంగు రంగుల్లో ఆకృతులను మార్చుకుంటున్న వాటర్ ఫౌంటేన్

మ్యూజిక్ కి తగినట్టుగా వయ్యారాలు, వంకరలు తిరుగుతున్న నీటి ధారలు

హైటెక్ సిటీ ఫ్లై ఒవర్ పక్కన నిర్మాణంలో ఉన్న 40 అంతస్తుల భవనం వద్ద సూర్యుని అస్తమయం ఇలా దర్శనమిచ్చింది.

పేకమేడలను తలదన్నేలా కనిపించే హైదరాబాద్ భవన నిర్మాణాలు

జిల్లుమనే నీటిని అందించే ఎర్రమట్టి కుండలు

నగర వాసులకు ఆకట్టుకునేలా తయారీదారుల సృజన. కాలానికి తగ్గట్టుగా మారుతున్న నీటికుండల సింగారం, ఆకారం.