Matsya 6000 Mission : సముద్రాన్వేషణకు “మత్స్య 6000 ” ( సముద్రయాన్ )
అంతరిక్ష పరిశోధనల్లో చంద్రయాన్ 3 తో విజయం కైవసం చేసుకున్న భారత్.. ఇప్పుడు మరో సముద్ర అన్వేషనకు సిద్దం అయింది. ఇందులో భాగంగా భారతదేశం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి , సముద్రపు అడుగుభాగంలో ఉన్న ఖనిజ వనరుల వంటి వనరులను అన్వేషించడానికి వచ్చే మూడేళ్లలో భారతదేశం తన సముద్రయాన్ మిషన్ కింద 6,000 మీటర్ల లోతులో నీటి అడుగున మిషన్ను నిర్వహించడానికి భారత్ సిద్ధం అయింది అని మంత్రి వెల్లడించారు.

సముద్ర గర్భంలో ఉండే మొత్తం ప్రదేశాలను, అక్కడి వాతావరణాన్ని, ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేసేందుకు ఉపయోగపడే ఒక సాధనం "మత్స్య -6000"

మానవ ప్రమేయం లేని డీప్ ఓషన్ మిషన్.

పర్యావరణానికి హాని చేయకుండా మనకు కావల్సిన సమాచారాన్ని ఫోటోల రూపంలో అందిస్తుంది.

దీనిని చెన్నైకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ది చేసింది.

2026 నాటికి దీనిని సముద్రంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

మొట్టమొదటి మానవ ప్రమేయంలేని సముద్రాన్వేషణ మిషన్ గా గుర్తింపు పొందింది.

సముద్రంలోని వనరులు, జీవ సంపద, అక్కడి పరిస్థితులను పరిశోధనలు జరుపుతుంది.

ఇందులో ముగ్గురు కూర్చొని ఆరు కిలోమీటర్ల వరకూ సముద్ర గర్భంలో ప్రయాణం చేయవచ్చు.

కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సామాజిక మాద్యమాల్లో ఈ ఫోటోస్ పోస్ట్ చేశారు.

సముద్ర గర్భంలోని అపారమైన ఖనిజ సంపదను గుర్తిస్తుంది.