AP Politics : ములాఖత్ లో ముఖ్యంశాలు.. కుదిరిన దోస్తీ .. ( టీడీపీ – జనసేన )
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు బాలకృష్ణ, నారా లోకేశ్ సమావేశమయ్యారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి వెళ్తాయి అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబాను కలిసిన నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో మీడియా సమావేశాలు వాడి వేడిని తలపిస్తున్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు రాజకీయవేత్త అని కొనియాడారు.

జగన్ ఆర్థిక నేరస్థుడు అంటూ మండిపఢ్డారు.

మీకు యుద్ధం కావాలంటే యుద్దమే ఇస్తాము.

రాయి వేసే ముందు ఆలోచించండి.. ఎవరినీ వదిలిపెట్టాము అధికారులకు పవన్ మాస్ వార్నింగ్.

అధికారులు జగన్ నీ నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే.

బిల్ క్లింటన్ , బిల్ గేట్స్ నీ రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు.

తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాము.

విజన్ 2020తో ఒక కొత్త నగరాన్ని నిర్మించిన ఘనత చంద్రబాబు.

చంద్రబాబు గారి అక్రమ అరెస్టు బాధాకరం.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనేదే తన ఆకాంక్ష అన్నారు.

వైసీపీని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని చెప్పారు పవన్.

నాలుగున్నరేళ్లుగా జగన్ అరాచక పాలన చూసి విసిగిపోయానన్నారు.

చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకే తాను ములాఖత్ కు వచ్చానన్నారు.

జగన్ కి 6 నెలలు మాత్రమే టైమ్ ఉంది.

ఆ తర్వాత ఆయన మద్దతుదారులకు యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు.

ఈలోపు తప్పు సరిదిద్దుకుంటే సరేనని, లేకపోతే సివిల్ వార్ కి తాము కూడా సిద్ధమేనన్నారు.

వైసిపి వ్యతిరేక ఓట్లు చీలనివ్వను.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించకూడదా..?

ఏపీలో అరాచక పాలన సాగుతోందని, అందులో భాగమే చంద్రబాబు గారి అరెస్ట్ అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి వెళ్తాయని, అందుకు ఈరోజే తాను నిర్ణయం తీసుకున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటన.

విజన్ 2020తో సైబరాబాద్ అనే ఒక కొత్త నగరాన్ని నిర్మించిన ఘనత చంద్రబాబు దే.

లక్షల కోట్ల సంపద సృష్టించిన చంద్రబాబు గారిపై రూ.317 కోట్ల స్కాం అంటూ అభియోగం మోపడం బాధాకరం.

ఈరోజు మేము ఇద్దరం కలవడం తమ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని స్పష్టత ఇచ్చారు.

రానున్న రోజుల్లో మరిన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు.

బీజేపీ మాతో కలిసి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం.

నారా భువనేశ్వరిని , నారా బ్రాహ్మణిని పరామర్శించిన పవన్ కళ్యాణ్.

వైఎస్ఆర్సీపీని అందరూ కలిసి ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ వ్యాఖ్యానించారు.