Male Beauties: అందం.. అబ్బాయైతే.. ఎలాగుంటుందో.. చూసేయండి..!
అబ్బాయిలు, అమ్మాయిల గెటప్ లు వేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చీరలు, లంగా ఓణీలు ప్రత్యేకమైన నగలు ధరించి ముస్తాబవుతారు. ఇది కేరళా రాష్ట్రంలోని కొట్టాయాం వనదుర్గమ్మ ఆలయ సాంప్రదాయం.

కేరళ రాష్ట్రం కొట్టాయాంలోని కొట్టం వన దుర్గ అమ్మవారి ఆలయంలో వింత సాంప్రదాయం.

ప్రతి ఏటా చెమ్మయ్య, విలక్కు అనే ఉత్సవం నిర్వహిస్తారు.

అమ్మాయిలు ఈ వన దేవతలకు పూజలు చేయడం నిషేధం.

ఏడాదిలో రెండు రోజులు మాత్రమే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

ఇలా పురుషులు, స్త్రీ రూపాన్ని ధరించి పూజలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని స్థానికుల విశ్వాసం.

గత రెండేళ్లుగా కరోనా సందర్భంగా ఈ వేడుకలు రద్దవడంతో ఈ సంవత్సరం విరివిగా భక్తులు పాల్గొన్నారు.

ఒకప్పుడు మూడు వేల మందికి పైగా ఇలా వేషధారణ వేసుకొని పూజల్లో పాల్గొనేవారంట.

అబ్బాయిలు అమ్మాయిల్లా అందంగా ముస్తాబై చెమ్మయ్య, విలక్కు అనే దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు.

ఇలాంటి సాంప్రదాయం తెలుగు రాష్ట్రాలైన కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా ఉంది.

ఉగాది మాసంలో ఈ రకమైన వేషలు వేసి ఆలయాలను సందర్శించి తమ కోరికలను నెరవేర్చుకుంటారు.